Delhi Shocker: ఢిల్లీలో దారుణం, తరగతి గదిలో విద్యార్థినులపై లైంగికదాడి చేసిన కామాంధుడు, బాలికల బట్టలు విప్పి వారి ముందేతన బట్టలు విప్పి మూత్రం పోసిన దుండగుడు
Man barges into classroom, removes clothes of minor girls (Photo-File Image)

Delhi, May 5: దేశరాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీలోని మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోకి వెళ్లిన దుండగుడు (Man barges into classroom) ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తీసేయించి.. వారి ఎదురుగానే టాయ్‌లెట్‌ పోశాడు. తూర్పు దిల్లీలోని భజన్‌ఫూర్‌లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో తరగతి గదిలోకి ప్రవేశించిన యువకుడు బాలికలపై లైంగిక వేధింపులకు (removes clothes of minor girls) పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారి ముందే మూత్ర విసర్జన చేశాడు. అయితే ఈ విషయం గురించి బాధితులు స్కూల్‌ ప్రిన్సిపల్‌, క్లాస్‌ టీచర్‌కు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదని విద్యార్థులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై పోలీసులు, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు (ఈఎంసీడీ) నోటీసులు జారీ చేసింది. నిందితుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామనిన్నారు.

భజన్‌పురా ప్రాంతంలోని ఒక MCD పాఠశాలలో, వారి తరగతిలో కూర్చున్న ఇద్దరు బాలికలను గుర్తు తెలియని వ్యక్తి వేధించాడు. అతను వారి తరగతికి వెళ్లి బాలికల బట్టలు తొలగించాడు. తర్వాత అతను తన బట్టలు తొలగించి తరగతి ముందు మూత్ర విసర్జన చేశాడు. " అని ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ (DCW) చీఫ్ స్వాతి మలివాల్ అన్నారు. ఈస్ట్ MCD కమిషనర్‌ను కమిషన్ ముందు పిలిపించగా, కఠిన చర్యలు తీసుకోవాలని మరియు నిందితులను అరెస్టు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్‌తో పోలీసులకు నోటీసు జారీ చేయబడింది.

లా యూనివర్సిటీలో కరోనా కల్లోలం, 60 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌, విద్యార్థులంతా మే 10 వరకు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశాలు

అజ్ఞాత వ్యక్తి పాఠశాలలోకి ఎలా ప్రవేశిస్తాడనే ప్రశ్నకు మా ముందు హాజరుకావాలని, సమాధానం ఇవ్వమని మేము తూర్పు MCD కమిషనర్‌ను పిలిపించాము. అమర్చిన CCTV లు ఏమయ్యాయి?," మలివాల్ అన్నారు.పాఠశాల యాజమాన్యం ఈ ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని, ఈ విషయాన్ని మర్చిపోవాలని బాలికలను కోరిందని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.పోక్సో చట్టం ప్రకారం పాఠశాల ప్రిన్సిపాల్ మరియు క్లాస్ టీచర్‌పై నివేదించనందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అలాగే పాఠశాలలో సీసీటీవీ కనిపించలేదు