పంజాబ్‌లో పటియాలాలోని రాజివ్‌ గాంధీ నేషనల్‌ లా యూనివర్సిటీ (RGNUL)లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్‌ వచ్చినవారందరిని ఐసోలేషన్‌కు తరలించామని వర్సిటీ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వర్సిటీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులంతా మే 10 వరకు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ మధ్యే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న వెల్హమ్‌ బాలికల పాఠశాలలో 16 మంది విధ్యార్థినులకు పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా ఢిల్లీలోని నోయిడా, గజియాబాద్‌లో స్కూల్‌ విద్యార్థులకు కరోనా సోకింది. ఇక ఐఐటీ మద్రాస్‌లో 170 కేసులు బయటపడ్డాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)