హర్యానా సుపీరియర్ జ్యుడీషియల్ సర్వీస్‌లో అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి పదవికి దరఖాస్తు చేసిన న్యాయవాది పర్దీప్ కుమార్ ఉపశమనం కోసం పిటిషన్ వేసినా.. పంజాబ్ & హర్యానా హైకోర్ట్ మంగళవారం తిరస్కరించింది. బార్ నుండి ప్రత్యక్ష నియామకం ద్వారా 25 పోస్టులను భర్తీ చేయడానికి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఒకరు కంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములు ఉన్న అభ్యర్థి జిల్లా న్యాయ సేవకు అర్హులు కారు. దరఖాస్తు ఫారమ్‌లో మీకు బహుళ భార్యలు ఉన్నారా? అనే కాలమ్ ఉంది, ఇందులో అభ్యర్థి “అవును” లేదా “కాదు” అని ప్రకటించాల్సి ఉంది.
కుమార్ పొరపాటుగా ఆ కాలమ్‌లో “అవును” అని రాశాడు. ఈ కారణంగా తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేసినా.. చీఫ్ జస్టిస్ షీల్ నాగు మరియు జస్టిస్ సంజీవ్ బెర్రీలతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్‌ను తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ నాగు వ్యాఖ్యానిస్తూ.. మీకు ఇద్దరు భార్యలు ఉన్నారని మీరు చెబుతున్నారు. నిజానికి ఉన్నది ఒకరేనా, ఇద్దరా లేదా ముగ్గురా? మీరు తప్పుగా ప్రకటిస్తే, రద్దు చేయడంలో వాళ్ళ తప్పేమీ లేదని తెలిపారు. అభ్యర్థి తన వాస్తవ పరిస్థితిని నిరూపించాల్సి ఉందంటూ కుమార్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
You Yourself State That You Have Two Wives, Says Punjab and Haryana High Court
The Punjab and Haryana High Court declined to grant relief to an advocate who, in his application for the post of Additional District & Sessions Judge in Haryana Superior Judicial Service, mistakenly declared that he has more than one wife.
"You will have to give proof you don’t… pic.twitter.com/c7sIttIdGu
— Bar and Bench (@barandbench) September 16, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)