Bihar Shocker: విడాకులు ఇవ్వాలంటే రూ.10 లక్షలు డిమాండ్ చేసిన భార్య,కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త, మార్చి 21న ఆత్మహత్య కార్యక్రమానికి హాజరుకావాలంటూ బ్యానర్

బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ఫరీదాబాద్ నగరంలోని వీధుల్లో (Man roaming Faridabad streets) బ్లాక్‌మెయిలర్ అత్తగారు, భార్య, బావమరిది కారణంగా కిడ్నీని అమ్మకానికి పెట్టారు. ఆత్మహత్య వేడుక మార్చి 21, 2023న" అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని వీధుల్లో తిరిగాడు.

Bihar Shocker: విడాకులు ఇవ్వాలంటే రూ.10 లక్షలు డిమాండ్ చేసిన భార్య,కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త, మార్చి 21న ఆత్మహత్య కార్యక్రమానికి హాజరుకావాలంటూ బ్యానర్
man roaming Faridabad streets with "kidney for sale" banner(Photo-Video Grab)

Patna, Mar 1: బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ఫరీదాబాద్ నగరంలోని వీధుల్లో (Man roaming Faridabad streets) బ్లాక్‌మెయిలర్ అత్తగారు, భార్య, బావమరిది కారణంగా కిడ్నీని అమ్మకానికి పెట్టారు. ఆత్మహత్య వేడుక మార్చి 21, 2023న" అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని వీధుల్లో తిరిగాడు. హార్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నా మూత్ర పిండం (kidney for sale) అమ్మకానికి సిద్ధంగా ఉంది’. ‘మార్చి 21న నా ఆత్మాహుతి కార్యక్రమం’ అని రాసి భార్యతో కలిసి, విడివిడిగా ఉన్న ఫొటోలతో కూడిన ఓ బ్యానర్‌తో (banner) తిరుగుతున్నాడో వ్యక్తి. రోడ్డుపై బ్యానర్‌తో అతడిని చూసిన కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.

అర్థరాత్రి తల్లి పక్కలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకెళ్లి చంపేసిన వీధి కుక్కలు, రాజస్థాన్ సిరోహి జిల్లా ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి..

బీహార్ రాజధాని పాట్నాకు చెందిన సంజీవ్‌కు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. కొన్నాళ్లపాటు కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. భార్య, బావమరిది, అత్తమామల నుంచి సంజీవ్‌కు వేధింపులు మొదలయ్యాయి. దీంతో విడాకులు తీసుకోవాలని అతడు భావించాడు.ఇక్కడే మరో సమస్య వచ్చి పడింది. విడాకులు కావాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాల్సిందేనని భార్య, అత్తమామలు పట్టుబట్టారు. ఏం చేయాలో తెలియని సంజీవ్ పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ కూడా అతడికి నిరాశే ఎదురైంది. ఇక ఏ దారీ కనిపించకపోవడంతో ఇదిగో ఇలా బ్యానర్ పట్టుకుని తిరుగుతున్నాడు.

అంబర్ పేట ఘటన మరువక ముందే మరో ఘటన, రోడ్డుపై పోతున్న వారిని ఇష్టమొచ్చినట్లుగా కరుచుకుంటూ పోయిన వీధి కుక్క, 10 మందికి తీవ్ర గాయాలు

ఈ నెల 21లోగా కిడ్నీ అమ్ముడుపోతే ఆ సొమ్మును తన భార్యకు ఇచ్చి విడాకులు తీసుకుంటానని, లేదంటే అదే రోజు పాట్నాలో ఆత్మాహుతి చేసుకుంటానని పేర్కొన్నాడు. అంతేకాదు, ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను ఆహ్వానిస్తూ బ్యానర్‌పై వారి పేర్లను ముద్రించాడు. బ్యానర్ రెండోవైపు భార్య, బావమరిది, వారి బంధువుల ఫొటోలను ముద్రించాడు.న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అధికారుల చుట్టూ తిరిగాను, కానీ ఫలించలేదు, నేను అనేక సార్లు పోలీస్ స్టేషన్‌ను సందర్శించాను, కానీ ఎవరూ నాకు సహాయం చేయలేదు, అందుకే నేను ఈ బ్యానర్‌తో ఇక్కడ వీధుల్లో ఉన్నానని ఆవేదనతో తెలిపాడు.

(The above story first appeared on LatestLY on Mar 01, 2023 10:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).