
Stray Dog Kills Infant Sleeping Next to Mother: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధి కుక్క ఎత్తుకెళ్లి కొరికి (Stray Dog Kills Infant) చంపేసింది. హాస్పిటల్ వార్డు బయట మృతదేహం (Stray Dog Kills Infant Sleeping Next to Mother) లభించింది. సోమవారం రాత్రి సిరోహి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేంద్ర మీనా అనే వ్యక్తి సిలికోసిస్ వ్యాధికి చికిత్స కోసం సిరోహి జిల్లా ఆస్పత్రిలోని టీబీ వార్డులో జాయిన్ అయ్యాడు. మహేంద్ర మీనా భార్య రేఖ.. చిన్నవాళ్లైన తన ముగ్గురు పిల్లలతో కలిసి అతనికి తోడుగు ఉండేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగే తన ముగ్గురు పిల్లలను పక్కలో వేసుకుని రేఖ నిద్రలోకి జారుకుంది.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వత రెండు వీధి కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయి. అనంతరం వీటిలో ఓ శునకం పసికందును బయటకు ఈడ్చుకెళ్లినట్లు అందులో రికార్డయింది.ఈ శిశువు తండ్రి టీబీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు భార్య, పిల్లలు కూడా ఇదే వార్డులో ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారు. అదే సమయంలో వీధికుక్క వార్డులోకి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఈ సమయంలో వార్డు సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ లేరని పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు.శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించామని పోలీసులు పేర్కొన్నారు.
తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తన బిడ్డను ఖననం చేశారని మహేంద్ర మీనా ఆరోపించాడు. తన భార్యతో తెల్లకాగితం మీద సంతకం తీసుకుని, తనకు చివరిచూపు కూడా చూపించకుండా అంత్యక్రియలు జరిపించారని విమర్శించాడు. అదేవిధంగా ఆస్పత్రిలో వీధి కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తుంటే సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.
మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులు కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రోగితో పాటు ఉన్న కుటంబసభ్యులు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వార్డు గార్డు వేరే వార్డుకు వెళ్లాడని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.