Salman Khan Meets Mamata Banerjee: బెంగాల్ సీఎంతో సల్మాన్ ఖాన్ భేటీ అరగంటపాటూ ఏకాంత చర్చలు, ఇద్దరి చర్చ దేనిపై అనేది సస్పెన్స్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని (Mamata Banerjee) బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కలిశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఆయన కోల్‌కతా వచ్చారు. అనంతరం కారులో సీఎం మమతా అధికార నివాసానికి వెళ్లారు. సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు.
Kolkata, May 13: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని (Mamata Banerjee) బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కలిశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఆయన కోల్‌కతా వచ్చారు. అనంతరం కారులో సీఎం మమతా అధికార నివాసానికి వెళ్లారు. సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్‌కు శాలువా కప్పారు. అనంతరం వారిద్దరూ కలిసి ప్రజలు, మీడియాకు అభివాదం చేశారు. కాగా, సల్మాన్ ఖాన్ సుమారు అర గంట పాటు సీఎం మమతా బెనర్జీ నివాసంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Actor Salman Khan meets West Bengal CM Mamata Banerjee at the latter's residence in Kolkata pic.twitter.com/ilydxg9Edi
— ANI (@ANI) May 13, 2023
ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే సల్మాన్ ఖాన్ బస చేసిన హోటల్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీని నటుడు సల్మాన్ ఖాన్ కలిసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
(The above story first appeared on LatestLY on May 13, 2023 10:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

