Boy Assaulted By Classmates: క్లాస్ మేట్ పై 8వ తరగతి స్టూడెంట్స్ అఘాయిత్యం, మల ద్వారంలో కర్ర పెట్టి పైశాచికానందం, బయట చెప్తే చంపేస్తామని హెచ్చరిక
14 ఏళ్ల బాలుడి పట్ల క్లాస్‌మేట్స్ దారుణంగా ప్రవర్తించారు. క్లాస్ రూమ్ నుంచి అతడ్ని బయటకు తీసుకెళ్లారు. దుస్తులు విప్పించి కర్రతో కొట్టారు. ఆపై కర్రను అతడి మలద్వారంలోకి చొప్పించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు
New Delhi, May 05: ఒక బాలుడ్ని తోటి విద్యార్థులు దారుణంగా వేధించారు. దుస్తులు విప్పించి అతడ్ని కొట్టడంతోపాటు మలద్వారంలో కర్రను చొప్పించారు. దీంతో ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. (Boy Assaulted By Classmates) మార్చి 18న ఒక స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడి పట్ల క్లాస్‌మేట్స్ దారుణంగా ప్రవర్తించారు. క్లాస్ రూమ్ నుంచి అతడ్ని బయటకు తీసుకెళ్లారు. దుస్తులు విప్పించి కర్రతో కొట్టారు. ఆపై కర్రను అతడి మలద్వారంలోకి చొప్పించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు. కాగా, ఈ సంఘటన వల్ల ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. తీవ్ర కడుపు నొప్పితో బాధపడటంతో అతడి పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు బాలుడి పేగులు దెబ్బతిన్నాయని, సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఏం జరిగిందని తల్లి అడగ్గా జరిగిన దారుణం గురించి అతడు చెప్పాడు. సర్జరీ చేయడంతో నెల రోజులు ఆసుపత్రిలో ఉన్న ఆ బాలుడు ఇటీవల ఇంటికి చేరుకున్నాడు.
మరోవైపు తన కుమారుడికి జరిగిన వేధింపుల పట్ల అతడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేసింది. అలాగే స్కూల్ యాజమాన్యం, అధికారులు కూడా తగిన చర్యలు చేపట్టాలని కోరింది. భయానక సంఘటన వల్ల తన కుమారుడు నిద్రలో లేచి ఉలిక్కి పడుతున్నాడని వాపోయింది. అలాగే మూడు నెలల తర్వాత మరో సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె పేర్కొంది.
(The above story first appeared on LatestLY on May 05, 2024 07:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

