HD Revanna Arrested: మాజీ ప్ర‌ధాని దేవెగౌడ త‌న‌యుడు రేవ‌ణ్ణ అరెస్ట్, లైంగిక ఆరోప‌ణల కేసులో అదుపులోకి తీసుకున్న సిట్, ముంద‌స్తు బెయిల్ నిరాక‌ర‌ణ‌
HD Revanna Arrested (PIC @ ANI X)

Bangalore, May 04: మహిళ కిడ్నాప్‌, లైంగిక ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణను (HD Revanna Arrested) బెంగళూరు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రేవణ్ణ తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. కిడ్నాప్‌ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని రేవణ్ణ (HD Revanna) వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలోనే పోలీసులు రేవణ్ణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

 

ఎన్నికల వేళ సంచలనం రేపిన సెక్స్‌ వీడియోల స్కాం​డల్‌ కేసులో కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా, ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈయనపై సెక్స్‌ స్కాండల్‌ కేసులో పోలీసులు ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.