Bride Attends Practical Exam: పెళ్లి దుస్తుల్లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసిన యువతి, చదువుపై ఉన్న ఆసక్తికి నెటిజన్ల హ్యాట్సాఫ్
ఒక మహిళ (Indian bride) పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరవ్వడం ద్వారా ఆ మహిళ చదువుకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని అందరూ అభినందిస్తున్నారు.
Thiruvananthapuram, FEB 13: ఒకే రోజు పెళ్లి.. అదే రోజు పరీక్ష వస్తే… రెండింటిలో దేన్నీ వదులుకోలేని పరిస్థితి ఎవరిదైనా. ఒకదాని కోసం ఇంకోటి వాయిదా వేయడం కుదరకపోవచ్చు. ఎందుకంటే పెళ్లి ఎంత ముఖ్యమో.. కెరీర్లో మంచి స్థానానికి ఎదిగేందుకు పరీక్షలు కూడా అంతే ముఖ్యం. అందుకే చాలా మంది తమ పెళ్లి రోజు కూడా పరీక్షలకు హాజరవుతుంటారు. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే ఎగ్జామ్స్‌కు వెళ్తుంటారు. తాజాగా ఒక మహిళ (Indian bride) పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరవ్వడం ద్వారా ఆ మహిళ చదువుకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని అందరూ అభినందిస్తున్నారు.
View this post on Instagram
కేరళకు చెందిన శ్రీ లక్ష్మీ అనిల్ అనే మహిళ, బెథాని నవజీవన్ కాలేజ్‌లో ఫిజియోథెరపీ చదువుతోంది. ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లి రోజే ఆమెకు ప్రాక్టికల్ ఎగ్జామ్ (practical exam) ఉంది.
View this post on Instagram
దీంతో తన కుటుంబ సభ్యులు, వరుడి సహకారంతో పెళ్లి రోజే పరీక్షకు హాజరైంది. అది కూడా పెళ్లి కూతురుగా ముస్తాబై ఉన్న దుస్తుల్లోనే (wedding dress) వెళ్లి, పరీక్షకు హాజరైంది. పరీక్షలో అందరు విద్యార్థుల్లాగే తన ఎప్రాన్ ధరించింది. పరీక్షకు హాజరైన శ్రీలక్ష్మికి తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. పరీక్ష అనంతరం బయటకు రాగానే తన తల్లిని హత్తుకుంది. తిరిగి పెళ్లి మండపానికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీ లక్ష్మిని అందరూ అభినందిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 13, 2023 12:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

