Vastu Exponent Murdered: కాళ్లు మొక్కి మరీ చంపేశారు, కర్ణాటకలో వాస్తు సిద్ధాంతి హత్య, 50 సార్లు పొడిచి చంపిన దుండగులు, పలువురు ప్రముఖులకు వాస్తు సూచనలు చేసే సిద్ధాంతి హత్యకు గల కారణాలేంటి?

ర్నాటక హుబ్లీలో(Hubballi) దారుణం జరిగింది. వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. చంద్రశేఖర్ గురూజీని(Chandrashekhar Guruji) ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది

Vastu Exponent Murdered: కాళ్లు మొక్కి మరీ చంపేశారు, కర్ణాటకలో వాస్తు సిద్ధాంతి హత్య, 50 సార్లు పొడిచి చంపిన దుండగులు, పలువురు ప్రముఖులకు వాస్తు సూచనలు చేసే సిద్ధాంతి హత్యకు గల కారణాలేంటి?

Hubli, July 05: కర్నాటక హుబ్లీలో(Hubballi) దారుణం జరిగింది. వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. చంద్రశేఖర్ గురూజీని(Chandrashekhar Guruji) ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. తాము చంద్రశేఖర్ (Chandrashekhar Guruji) శిష్యులుగా చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు సిబ్బందిని నమ్మించి లోపలికి వచ్చారు. చంద్రశేఖర్ రూమ్ నుంచి బయటకు రాగానే ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆ వెంటనే ఈ దారుణానికి పాల్పడ్డారు. సిద్ధాంతిని దుండగులు 50 సార్లు పొడిచి చంపినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ కు వాస్తు సిద్ధాంతిగా మంచి పేరుంది. సరళ వాస్తు పేరుతో కొన్ని వందల ఉపనాస్యాలు ఇచ్చారు. 2వేల సెమినార్లలో పాల్గొన్నారు. చాలా మంది ప్రముఖులు ఆయన మాటకు విలువ ఇచ్చేవారు.

అయితే ఆయనను ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. గతంలో ఆయన ఓ ప్రైవేట్ సంస్థను నెలకొల్పారు. దానికి సంబంధించి జీతాల వివాదం ఒకటి ఉంది. హత్యకు అదే కారణమా? లేక మరో కారణం ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను బాగల్ కోట్ కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య తర్వాత వారు పరార్ అయ్యారు.

Tamil Nadu Shokcer: ఫాస్టర్ కాదు కామాంధుడు, పక్క ఇంట్లోకి దూరి చెల్లిని రూంలో బంధించి అక్కపై లైంగికదాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన కోయంబత్తూరు పోలీసులు 

మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమం కోసం చంద్రశేఖర్ గురూజీ హుబ్లీకి వచ్చారు. ప్రముఖ వాస్తు సిద్ధాంతి దారుణ హత్య సంచలనం రేపుతోంది. గురూజీ శిష్యులను, సన్నిహితులను షాక్ కి గురి చేసింది.

(The above story first appeared on LatestLY on Jul 05, 2022 10:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).