Coimbatore, July 5: మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తాజాగా కోయంబత్తూరులో 17 ఏళ్ల బాలికపై తమిళనాడు ఫాస్టర్ ఒకరు లైంగిక వేధింపులకు ప్రయత్నించారు. ప్రస్తుతం అతడిని లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) ( booked under POCSO) కింద పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిందితుడిని స్టీఫెన్ రాజ్‌గా గుర్తించారు. కోయంబత్తూరులోని పోతనూరులో ఈ ఫాస్టర్ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
ఇద్దరు మైనర్ బాలికలు తన అమ్మమ్మతో పొరుగున ఉండే ఇంట్లో ఉంటున్నారు. వారి అమ్మమ్మ పని కోసం బయటకు వెళ్లిన తర్వాత, స్టీఫెన్ రాజ్ వారి ఇంటికి ప్రవేశించి 17 ఏళ్ల బాలికపై (17-year-old girl in Coimbatore) లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె చెల్లెలిని వేరే గదిలో బంధించి బాధితురాలిని లైంగిక వేధింపులకు (Priest tries to sexually assault) గురిచేశాడు. బాలిక సాయం కోసం అరవగా నిందితుడు పరారయ్యాడు. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు బోధకుడు స్టీఫెన్ రాజ్‌ను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
గత వారం కేరళ నుండి నివేదించబడిన మరొక సంఘటనలో, ఎర్నాకులంలోని మనంతవాడి డియోసెస్‌కు చెందిన అడకతోడు చర్చి వికార్ అయిన సెబాస్టియన్ కీజెత్, పెద్ద సంఖ్యలో మహిళలు మరియు కాథలిక్ సన్యాసినులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లో ఒక నీచమైన వీడియోను పంచుకున్నారు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మరో సంఘటనలో, కేరళలోని పతనంతిట్టా చర్చికి చెందిన ఫాస్టర్ ప్రార్థనలు మరియు కౌన్సెలింగ్ కోసం చర్చిని సందర్శించిన తర్వాత మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.నిందితుడిని పతనంతిట్టలోని కూడల్ ఆర్థోడాక్స్ చర్చి వికార్‌గా ఉన్న పాండ్‌సన్ జాన్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతనిపై పతనంతిట్ట మహిళా పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు.