Chennai, July 5: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. వెహికల్ బుకింగ్‌కు సంబంధించి ఓటీపీ (one-time password) నంబర్ చెప్పలేదని ఓ క్యాబ్‌డ్రైవర్ ఓ ప్రయాణికున్ని చంపేశాడు. భార్యా పిల్లల ముందే ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని చెన్నై శివారులోని గూడువాంజేరి సమీపంలోని కన్నివాక్కం కుందన్‌నగర్‌లో ఉంటున్న ఉమేందర్(33) కోయంబత్తూరులోని ఓ ప్రముఖ సంస్థలో ఐటీ ఇంజినీరుగా పని చేస్తున్నాడు.
ప్రతి శని, ఆదివారం చెన్నైకు వచ్చి కుటుంబంతో గడుపి వెళుతుంటాడు. ఆదివారం ఉమేందర్ భార్య భవ్య(30), పిల్లలు అక్రోష్, కరన్‌తో పాటు భవ్య సోదరి దేవిప్రియ, ఆమె పిల్లలతో కలిసి ఓఎంఆర్ రోడ్డులోని సినీ కాంప్లెక్స్‌లో సినిమాకు వెళ్లారు.అనంతరం ఇంటికి వెళ్లడానికి దేవిప్రియ క్యాబ్ బుక్ చేసింది. కారు ఎక్కాక డ్రైవర్ రవి బుకింగ్ ఓటీపీ నంబర్ చెప్పాలని కోరాడు. ఈ విషయమై వారి మధ్య మాటామాటా పెరిగి గొడవకు (Cab driver arrested) దారి తీసింది. కారు దిగే సమయంలో ఉమేందర్ డోర్‌ను గట్టిగా నెట్టడంతో రవి దాడి ( pushing a passenger to death in Navalur) చేశాడు.
దీంతో అతను స్పృహ తప్పాడు. అయితే డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా కేలంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. స్పృహ తప్పిన ఉమేందర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.