Chhattisgarh: 20 ఏళ్ల క్రితం చంపేస్తే ఇప్పుడు కలలోకి వచ్చి హింసిస్తున్నాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి, కేసు దర్యాప్తు చేస్తున్న ఛత్తీస్‌గఢ్ పోలీసులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ళ క్రితం హత్య చేసిన ఓ మనిషి రోజూ కలలోకి వచ్చి నన్ను హింసిస్తున్నాడంటూ పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కాగా అతడి మృతదేహం కోసం పోలీసులు ఏడాదిగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. తాజాగా అతనే వచ్చి చెప్పడంతో కేసు మరో మలుపు తిరిగింది
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ళ క్రితం హత్య చేసిన ఓ మనిషి రోజూ కలలోకి వచ్చి నన్ను హింసిస్తున్నాడంటూ పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కాగా అతడి మృతదేహం కోసం పోలీసులు ఏడాదిగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. తాజాగా అతనే వచ్చి చెప్పడంతో కేసు మరో మలుపు తిరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో బాలోద్‌లోని కరక్‌భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియారా 2003లో ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తిని హత్య చేసి అడవిలో పాతిపెట్టానని గ్రామస్థులతో గతేడాది తెలిపాడు.అతడు తన భార్యకు స్నేహితుడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో హతమార్చానని పేర్కొన్నాడు.
అయితే ఛవేశ్వర్ ఇప్పుడు రోజు రాత్రి తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారంలో కొలియారాపై పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా తవ్వకాలు చేపట్టారు. కానీ మృతదేహం లభించలేదు. ఈలోపు- కొలియారా మానసిక ఆరోగ్యం బాగాలేదని అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు.
కానీ ఛవేశ్వర్ తండ్రి పట్టువిడవలేదు. మళ్లీ తవ్వకాలు జరపాలంటూ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు.. బుధవారం మరోసారి తవ్వకాలు చేపట్టారు. ఓ డ్యామ్ పక్కన జరిపిన తవ్వకాల్లో కొన్ని ఎముకలు, వస్త్రాలను గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం ఎముకలను ప్రయోగశాలకు పంపారు.
(The above story first appeared on LatestLY on Apr 21, 2023 12:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

