COVID-19 in India: గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,540 కొత్త కేసులు నమోదు, భారతదేశంలో 17,656 దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, 559కు పెరిగిన మరణాల సంఖ్య
మహారాష్ట్రలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ఇక్కడ సోమవారం సాయంత్రం నాటికి నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,203 దాటగా, మరణాల సంఖ్య 223కు ఎగబాకింది.
New Delhi, April 20: గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,540 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో భారతదేశంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య సోమవారం సాయంత్రానికి 17,656 దాటింది. కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 559కి పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇప్పటివరకు 2841 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 14,255 యాక్టివ్ కేసులు ఉన్నాయని తాజా బులెటిన్లో పేర్కొన్నారు. కోవిడ్-19పై పోరు కోసం రాష్ట్రాల పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
మహారాష్ట్రలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ఇక్కడ సోమవారం సాయంత్రం నాటికి నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,203 దాటగా, మరణాల సంఖ్య 223కు ఎగబాకింది. ఆ తర్వాత న్యూ ఢిల్లీలో 2,003 కేసులు, గుజరాత్‌లో 1851, మధ్యప్రదేశ్‌లో 1485, రాజస్థాన్ రాష్ట్రంలో 1478, తమిళనాడులో 1477 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 873కి పెరగగా, ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు 722కు చేరాయి.
రాష్ట్రాల వారీగా ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
| S. No. | Name of State / UT | Total Confirmed cases (Including 77 foreign Nationals) | Cured/Discharged/
Migrated |
Death |
| 1 | Andaman and Nicobar Islands | 15 | 11 | 0 |
| 2 | Andhra Pradesh | 722 | 92 | 20 |
| 3 | Arunachal Pradesh | 1 | 0 | 0 |
| 4 | Assam | 35 | 17 | 1 |
| 5 | Bihar | 96 | 42 | 2 |
| 6 | Chandigarh | 26 | 13 | 0 |
| 7 | Chhattisgarh | 36 | 25 | 0 |
| 8 | Delhi | 2003 | 290 | 45 |
| 9 | Goa | 7 | 7 | 0 |
| 10 | Gujarat | 1851 | 106 | 67 |
| 11 | Haryana | 233 | 87 | 3 |
| 12 | Himachal Pradesh | 39 | 16 | 1 |
| 13 | Jammu and Kashmir | 350 | 56 | 5 |
| 14 | Jharkhand | 42 | 0 | 2 |
| 15 | Karnataka | 395 | 111 | 16 |
| 16 | Kerala | 402 | 270 | 3 |
| 17 | Ladakh | 18 | 14 | 0 |
| 18 | Madhya Pradesh | 1485 | 127 | 74 |
| 19 | Maharashtra | 4203 | 507 | 223 |
| 20 | Manipur | 2 | 2 | 0 |
| 21 | Meghalaya | 11 | 0 | 1 |
| 22 | Mizoram | 1 | 0 | 0 |
| 23 | Nagaland | 0 | 0 | 0 |
| 24 | Odisha | 68 | 24 | 1 |
| 25 | Puducherry | 7 | 3 | 0 |
| 26 | Punjab | 219 | 31 | 16 |
| 27 | Rajasthan | 1478 | 183 | 14 |
| 28 | Tamil Nadu | 1477 | 411 | 15 |
| 29 | Telengana | 873 | 190 | 21 |
| 30 | Tripura | 2 | 1 | 0 |
| 31 | Uttarakhand | 44 | 11 | 0 |
| 32 | Uttar Pradesh | 1176 | 129 | 17 |
| 32 | West Bengal | 339 | 66 | 12 |
| Total number of confirmed cases in India | 17656* | 2842 | 559 | |
అయితే, గతంతో పోలిస్తే COVID-19 యొక్క రికవరీ రేటులో పురోగతి కనిపిస్తుంది. ఈ రోజు రికవరీ రేటు 14,75 శాతంగా ఉండగా ఆదివారం 14.19 శాతంగా, శనివారం 13.85 శాతంగా నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
కేసుల నమోదులో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని తెలిపారు. లాక్డౌన్ కారణంగా భారతదేశంలో COVID-19 రెట్టింపు రేటు 7.5 రోజులుగా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇదే లాక్డౌన్ ముందు, అంటే మార్చి 25, 2020 సమయంలో ఈ రెట్టింపు రేటు 3.4 రోజులుగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Apr 20, 2020 09:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

