Amaravati, April 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా(Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా (Coronavirus Cases) బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్ కాగా, 20 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్-19 కేసులకు సంబంధించిన బులెటిన్‌ను (AP COVID-19 Bulletin) విడుదల చేసింది. కర్నూలు జిల్లా 174 కేసులతో టాప్‌లో ఉండగా.. 149 కేసులతో గుంటూరు తర్వాతి స్థానంలో ఉంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, రాష్ట్రాలపై సీరియస్ అయిన హోంశాఖ
జిల్లాల వారీ వివరాల ప్రకారం అనంతపురంలో కొత్తగా 4, చిత్తూరులో 25, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 20, కడపలో 3, క్రిష్ణాలో 5, కర్నూలులో 16 కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.
Here's AP COVID-19 Bulletin
#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 75 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 722 పాజిటివ్ కేసు లకు గాను 92 మంది డిశ్చార్జ్ కాగా, 20 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 610. #APFightsCorona pic.twitter.com/X1UuSAMM2t
— ArogyaAndhra (@ArogyaAndhra) April 20, 2020
ఇండియాలో 17 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 543 మంది మృతి
గడిచిన 24 గంటల్లో 27 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరులో 15, కృష్ణలో 10, విశాఖపట్నంలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. ఇక అనంతపురం, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో కోవిడ్‌తో ఒక్కొక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20కి చేరింది.
కోవిడ్– 19 నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించింది. దీంతో ఏపీలో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3775 మంది శాంపిళ్లకు పరీక్షలు నిర్వహించగా 75 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 37,297 మందికి పరీక్షలు నిర్వహించి... దేశంలో వైద్యపరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 2 లో నిలిచింది.