Coronavirus Outbreak | Representational Image| (Photo Credits: IANS)

New Delhi, April 20: దేశంలో కరోనావైరస్ (India Coronavirus) రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 36 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో (India) కరోనా కేసుల సంఖ్య 17,265కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 2,546 మంది డిశ్చార్జ్‌ కాగా, 543 మంది మృతిచెందారని తెలిపింది.

జ్వరం, దగ్గు, జలుబు మందులు కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

దేశంలో ప్రస్తుతం 14,175 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. భారత్‌లో ఇవాళ్టి వరకు 3.86 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా 24గంటల వ్యవధిలోనే 37వేల టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) వెల్లడించింది.

మహారాష్ట్రలో (Maharashtra) 4 వేల 203 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 223 మంది మృతి చెందారు. ఢిల్లీలో 2 వేల 3 కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ లో 1407 కేసులు నమోదు కాగా, 72 మృతి చెందారు. గుజరాత్ లో 1743 కేసులు నమోదు కాగా, 63 మంది మృతి చెందారు. తమిళనాడులో 1477 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 15 మంది మృతి చెందారు.

S. No. Name of State / UT Total Confirmed cases (Including 77 foreign Nationals) Cured/Discharged/Migrated Death
1 Andaman and Nicobar Islands 15 11 0
2 Andhra Pradesh 646 42 15
3 Arunachal Pradesh 1 0 0
4 Assam 35 17 1
5 Bihar 93 42 2
6 Chandigarh 26 13 0
7 Chhattisgarh 36 25 0
8 Delhi 2003 72 45
9 Goa 7 7 0
10 Gujarat 1743 105 63
11 Haryana 233 87 3
12 Himachal Pradesh 39 16 1
13 Jammu and Kashmir 350 56 5
14 Jharkhand 42 0 2
15 Karnataka 390 111 16
16 Kerala 402 270 3
17 Ladakh 18 14 0
18 Madhya Pradesh 1407 127 70
19 Maharashtra 4203 507 223
20 Manipur 2 1 0
21 Meghalaya 11 0 1
22 Mizoram 1 0 0
23 Nagaland 0 0 0
24 Odisha 68 24 1
25 Puducherry 7 3 0
26 Punjab 219 31 16
27 Rajasthan 1478 183 14
28 Tamil Nadu 1477 411 15
29 Telengana 844 186 18
30 Tripura 2 1 0
31 Uttarakhand 44 11 0
32 Uttar Pradesh 1084 108 17
32 West Bengal 339 66 12
Total number of confirmed cases in India 17265 2547 543

రాజస్థాన్ లో 1478 కేసులు నమోదు కాగా, మృతి 14 చెందారు. తెలంగాణలో 858 కేసులు నమోదు కాగా, మృతి 21 చెందారు. ఏపీలో 647 కేసులు నమోదు కాగా, 17 మంది చనిపోయారు. మరోవైపు కేరళలో 402 మందికి కరోనా సోకగా.. అందులో 270 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మగ్గురు మృతిచెందారు.ఢిల్లీలో 2,003 కేసులు నమోదయ్యాయి.

నేటి నుంచి లాక్‌డౌన్ సడలింపు, మార్గదర్శకాలు ఏంటో ఓసారి తెలుసుకోండి

జ‌మ్మూక‌శ్మీర్ లో ఇవాళ కొత్త‌గా 9 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. క‌శ్మీర్ డివిజ‌న్ లో 8 కేసులు. జ‌మ్మూ డివిజ‌న్ లో ఒక కేసు న‌మోదైంది. ఈ కేసుల‌తో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 350కి చేరుకున్న‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్ (ప్ర‌ణాళికశాఖ‌) ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ రోహిత్ కన్సాల్ తెలిపారు. వీటిలో జ‌మ్మూ డివిజ‌న్ నుంచి 55, క‌శ్మీర్ డివిజ‌న్ నుంచి 295 కేసులున్న‌ట్లు చెప్పారు. క‌రోనా కేసుల సంఖ్య పెరుగకుండా లాక్ డౌన్, సామాజిక‌దూరం పాటించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

మహారాష్ట్రలో ఒక్కరోజే 552 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 4,200 దాటింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 25శాతం కంటే ఎక్కువే. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 565కు పెరిగిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో మహారాష్ట్రలోనే 223 మంది మరణించారు. దేశంలోని మరణాల్లో మహారాష్ట్ర వాటానే 40 శాతానికిపైగా ఉన్నది. దేశంలో కరోనా మరణాల శాతం 3.5గా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

దేశంలోని 54 జిల్లాల పరిధిలో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా రికార్డు కాలేదని చెప్పారు. కరోనా నివారణకు వ్యాక్సిన్లు, ఔషధాల టెస్టింగ్‌ కోసం వైద్య శాస్త్ర సంబంధ రంగాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఆదివారం ఏర్పాటైందని తెలిపారు. దేశంలో నమోదైన కేసుల్లో 46.39% (6,540) కేసులు 10 జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ముంబైలో 2,079, ఇండోర్‌లో 842, న్యూఢిల్లీ 802, అహ్మదాబాద్‌ 590, పుణె 496, జైపూర్‌ 489, హైదరాబాద్‌ 407, దక్షిణ ఢిల్లీ 320, థానె 293, చెన్నై 222 కేసులు నమోదయ్యాయి.