Cuddalore Shocker: తాగుబోతు కొడుకు..మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని దారుణంగా రాడ్‌తో కొట్టి చంపేశాడు, తమిళనాడు కడలూరులో ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు (Cuddalore Shocker) చేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతండ్రిని ఓ కసాయి కొడుకు (TN man beats father to death) కడతేర్చాడు. ఈ ఉదంతం తమిళనాడులోని కడలూరులో సోమవారం వెలుగుచూసింది.
Cuddalore, Oct 19: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు (Cuddalore Shocker) చేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతండ్రిని ఓ కసాయి కొడుకు (TN man beats father to death) కడతేర్చాడు. ఈ ఉదంతం తమిళనాడులోని కడలూరులో సోమవారం వెలుగుచూసింది. మద్యానికి బానిసైన ఆ తాగుబోతు నిందితుడు ఐరన్ రాడ్‌తో తండ్రిపై దాడి (Drunkard batters Dad to death) చేయడంతో అతడు మరణించాడని పోలీసులు తెలిపారు.
తండ్రి మృతదేహాన్ని ఉంచేందుకు ఫ్రీజర్ బాక్స్‌కు నిందితుడు ఆర్డర్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. డెలివరీ ఏజెంట్ ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నప్పుడు, అతను శరీరంపై అనేక రక్తస్రావం గాయాలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న కడలూర్ పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేసే కార్తీక్ ఏడాదిన్నర కిందట ఉద్యోగం వదిలివేసి కడలూరులో ఆనైకుప్పంలోని తండ్రి వద్దే ఉంటున్నాడు.
బాధిత తండ్రిని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రమణియన్‌గా గుర్తించారు. అతని భార్య మరణం తర్వాత ఒంటరిగా ఉంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన కార్తీక్ తరచూ మద్యం తాగేందుకు తండ్రిని డబ్బు ఇవ్వాలని (money to buy liquor) వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన కార్తీక్ తండ్రిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి విపరీతంగా కొట్టడంతో ఆయన మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 19, 2021 08:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

