Hyd, Oct 19: ప్రేమ పేరుతో కళ్లు మూసుకుపోయి కన్నతల్లినే కడతేర్చిందో కసాయి కూతురు. తను ప్రేమించినవాడితో తిరగొద్దు అని తల్లి అనడంతో లవర్ తో కలిసి అతి దారుణంగా హత్య (Daughter killed mother with her Boyfriend) చేసింది. ఇంతా దారుణమైన విషయం ఏంటంటే కూతురు ఆమె లవర్ ఇద్దరూ మైనర్లే. హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, సీఐ కనకయ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ మెట్ లో నివసించే దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. చిన్నతనంనుంచి వీరికి అల్లారు ముద్దుగా పెంచారు. ఆ తరువాత ఓ మంచి సంబంధం చూసి...పెద్ద కూతురు వివాహం చేశారు. చిన్న కూతురు పదిహేడేళ్లదే కావడంతో ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో చిన్న కూతురు (17) స్థానికంగా ఉండే ఓ పదిహేడేళ్ల బాలుడితో ప్రేమలో పడింది.
ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. ఇంత చిన్న వయసులో ప్రేమ ఏంటి.. చదువుకోవాలని.. ఇలాంటివి తనకు నచ్చవు అంటూ పలుమార్లు తల్లిని మందలించింది. అతడిని కలవొద్దని, తిరగొద్దని సోమవారం మధ్యాహ్నం మరోసారి చెప్పింది. అయితే, కూతురుకి ఇది నచ్చలేదు. అందుకే, అదే సమయంలో ఆ బాలుడిని అక్కడికి రమ్మని ఆ అమ్మాయి పిలిచింది. వచ్చిన తరువాత వారిద్దరూ కలిసి తల్లితో గొడవ పడ్డారు. మాటా, మాటా పెరిగి అది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో సోమవారం కూతురు ప్రియుడితో కలిసి యాదమ్మకు ఉరి వేసి హత్య (Daughter killed mother) చేసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తరువాత బాధితురాలి భర్త ఇంటికి వచ్చి చూస్తే భార్య విగతజీవిగా కనిపించడంతో.. అనుమానం వచ్చింది. స్థానికులకూ వీరి గొడవ విషయం తెలియడంతో వారూ అనుమాన పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడుని, బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.