Philadelphia, Oct 19: అమెరికాలోని పెన్సిల్వినేయాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు రైళ్లో చూస్తుండగానే మహిళపై అత్యాచారం చేశాడు. చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆ రేప్ ఘటనను చూేస్తూ ఉండిపోయారు కాని అతడిని అడ్డుకోలేదు. ఆ మహిళ కాపాడండి అని ఎంత అరుస్తున్నా వారిలో చలనం (Passengers failed to intervene) రాలేదు.
కదులుతున్న రైలులో ఓ మృగాడు మహిళపై అత్యాచారానికి (woman was raped on SEPTA train) పాల్పడ్డ సమయంలో రైలులో పదుల కొద్ది జనాలు ఉన్నారు..కానీ ఒక్కరు కూడా దారుణాన్ని ఆపలేకపోయారు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్ చేయలేదు. ఫిలడెల్ఫియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొన్ని రోజుల క్రితం బాధితురాలు 69 వ వీధి రవాణా కేంద్రం వైపు మార్కెట్-ఫ్రాంక్‌ఫోర్డ్ లైన్ మీదుగా రాత్రి పది గంటల ప్రాంతంలో రైలు ప్రయాణం చేస్తుంది. అదే ట్రైన్‌లో నిందితుడు ఫిస్టన్ ఎన్‌గోయ్ కూడా ఉన్నాడు. బాధితురాలి పక్కనే కూర్చుని ఉన్నాడు. పలుమార్లు ఆమెను అసభ్యకరంగా తాకాడు. ఆమె ప్రతిఘటించినప్పటికి అతడి తీరు మార్చుకోలేదు. ఆ సయమంలో ట్రైన్‌లో బాధితురాలితో పాటు కొద్ది మంది ప్రయాణికులు కూడా ఉన్నారు.
రైలులో ఉన్న ప్రయాణికులు ఫిస్టన్ అనుచిత చర్యలను చూస్తూ ఉన్నారు కానీ.. ఎవరు ముందుకు వచ్చి అతడిని వారించే ప్రయత్నం చేయలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన ఫిస్టన్ ప్రయాణికులందరూ చూస్తుండగానే.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను కాపాడాల్సిందిగా ఎంత ప్రాధేయపడినా.. ఎవరు ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకు రైల్వే ఉద్యోగులు కూడా ఆమెకు సాయం చేయలేదు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్ చేయలేదు.
ఆ తర్వాత రైలులోకి వచ్చిన ఓ వ్యక్తి జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు కాల్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఫిస్టన్‌ని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘రైలులో ఈ దారుణం జరుగుతున్న సమయంలో అక్కడ డజన్ల కొద్ది ప్రయాణికులు ఉన్నారు. వారు కాస్త ధైర్యం చేసి ముకుమ్మడిగా ముందుకు వచ్చి ఉంటే నిందితుడు భయపడేవాడు.. బాధితురాలికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఈ సంఘటన పట్ల మనందరం సిగ్గుపడాలి. ఒక్కడిని చూసి ఇంతమంది భయపడటం చాలా అవమానకరం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.