Karnataka Shocker: ఇదేం పోయేకాలం..ఇద్దరు మగాళ్లను దారుణంగా రేప్ చేసిన కామాంధులు, కర్ణాటకలో దారుణ సంఘటనలు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Image used for representational purpose | (Photo Credits: File Image)

Puttur, Oct 17: కామంతో రగులుతున్న కామాంధులకు ఆడ, మగా, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా పోతోంది. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. వారిలో మాత్రం మార్పు రావడం లేదు. బాలికలు, మహిళలు, వృద్ధులను కూడా వదిలిపెట్టడంలేదు. చివరకు మగవారిని కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా కర్ణాటకలోదారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు సాయంత్రం వాకింగ్ వెళ్తే.. కామాంధులు అతనిపై కన్నేశారు. అలాగే మరో ఘటనలో ఓ యువకుడిపై అత్యాచారం (20-year-old man raped) జరిగింది.

దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కబాక గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సరదాగా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగొచ్చినప్పుడు భయంతో వణికిపోతుండటం, దుస్తుల నిండా బురద అంటి ఉండటంతో తండ్రి కంగారుపడ్డాడు. ఏం జరిగిందని అడగ్గా, ఆ కొడుకు ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు. అదే గ్రామానికి చెందిన మొహ్మద్ హనీఫ్ తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది.

మంచి నిద్రలో భర్త.. సలసల కాగే నీటిని పురుషాంగంపై పోసిన భార్య, విలవిలలాడుతూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు, ఏలూరులో దారుణ ఘటన

యువకుడు వాకింగ్ కోసం బయటికెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ సమీపంలో హనీఫ్ పలకరించాడు. తెలిసినవాడే కదాని యువకుడు కూడా మాట కలిపాడు. వాకింగ్ చేస్తున్నావుగా, చెరుకు రసం తాగిస్తానంటూ (being lured with sugarcane) నమ్మబలికిన హనీఫ్.. ఆ నెపంతో యువకుణ్ని పట్టుకుని చెరుకుతోటల్లోని  పొదల్లోకి లాక్కెళ్లి రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు హనీఫ్ పై రేప్ కేసు పెట్టి అరెస్టు చేశారు. నిందితుడు హనీఫ్ పై ఐపీసీ 504, 323, 377, 506 సెక్షన్ల కింద కేసు పెట్టామని, కోర్టులో శిక్ష పడేలా ఆధారాలు సేకిస్తున్నామని పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు.

కామాంధులైన రాజకీయ నాయకులు, మైనర్ బాలికపై 5 ఏళ్ల నుంచి అత్యాచారం, ఎస్పీ, బీఎస్పీ నేతలను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు, లలిత్‌పూర్ మైనర్ బాలిక రేప్ కేసులో 7 మంది అరెస్ట్

మరో ఘటనలో బెల్గాం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడిపై అత్యాచారం జరిగింది. అంతాని అనే పట్టణానికి చెందిన వ్యక్తి హోటల్‌లో హెల్పర్ గా పని చేస్తుంటాడు. ఈ నెల 5న పని ముగించుకుని బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి యువకుణ్ని బైక్ మీద తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు రాజును అరెస్టు చేశారు.

ఇదే జిల్లాలో గత వారం స్కూలుకు వెళ్లొస్తున్న బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే.