Iloilo Esplanade Viral Video: ఫిలిప్పీన్స్‌ పబ్లిక్ పార్కులో విద్యార్థుల సె*క్స్ వీడియో వైరల్.. క్లిప్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక

ఫిలిప్పీన్స్‌లోని ఇలోయిలో నగరంలో గల ఎస్ప్లనేడ్ బహిరంగ ప్రదేశంలో ఇద్దరు విద్యార్థులు అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక అధికారులు తీవ్రంగా స్పందించారు.

Iloilo Esplanade Viral Video: ఫిలిప్పీన్స్‌ పబ్లిక్ పార్కులో విద్యార్థుల సె*క్స్ వీడియో వైరల్.. క్లిప్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
Screenshots From Iloilo Esplanade Viral Video (Photo Credits: X)

Iloilo Esplanade Viral Video: ఫిలిప్పీన్స్‌లోని ఇలోయిలో నగరంలో గల ఎస్ప్లనేడ్ బహిరంగ ప్రదేశంలో ఇద్దరు విద్యార్థులు అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన ఇలోయిలో సిటీ పోలీస్ ఆఫీస్ (ICPO), సదరు వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం, రీపోస్ట్ చేయడం లేదా ఫార్వార్డ్ చేయడం తీవ్రమైన నేరమని ప్రజలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

లాపుజ్ జిల్లాలోని బరాంగే ప్రోగ్రెసో (ఎస్ప్లనేడ్ 8) వద్ద పాఠశాల యూనిఫాంలో ఉన్న ఒక యువకుడు.. యువతికి సంబంధించిన ఫుటేజీ నెట్‌లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఐసిపిఓ పోలీస్ కల్నల్ విల్బర్ట్ బి. పారిల్లా నేతృత్వంలో సైబర్ క్రైమ్ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి వీడియో ప్రామాణికతను.. అందులోని వ్యక్తులను, ఫుటేజీని మొదట అప్‌లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.

సదరు వీడియోలో ఉన్న వ్యక్తులు మైనర్లుగా అనుమానిస్తున్నందున, ఆ ఫుటేజీని పంపిణీ చేయడం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుందని అధికారులు నెటిజన్లను హెచ్చరించారు.

అభ్యంతరకర వీడియోలు పోస్ట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రీమాకు బిగ్ షాక్, దేశం విడిచి వెళ్లాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన ఖతార్ ప్రభుత్వం..

ఈ వీడియోను షేర్ చేసే వ్యక్తులపై పెట్టే కేసులు:

OSAEC చట్టం: పిల్లలపై ఆన్‌లైన్ లైంగిక వేధింపులు లేదా దోపిడీ నిరోధక చట్టం.

యాంటీ ఫొటో అండ్ వీడియో వోయూరిజం యాక్ట్ (2009): వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన చట్టం.

డేటా ప్రైవసీ యాక్ట్ (2012): సమాచార గోప్యతా చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

పబ్లిక్ పార్కులు, ఎస్ప్లనేడ్‌లు ఆరోగ్యకరమైన వినోదం, సామాజిక కార్యకలాపాల కోసమేనని గుర్తుచేసిన కల్నల్ పారిల్లా, యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు, సంరక్షకులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని కోరారు. ప్రతి చర్యకు పర్యవసానాలు ఉంటాయి. బహిరంగంగా లేదా ఏకాంతంగా చేసే పనులు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు.

మరోవైపు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ది ఫిలిప్పీన్స్ (NUJP), ఇలోయిలో మీడియా-సిటిజన్ కౌన్సిల్ (IMCC) లు కూడా స్పందించాయి. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారి మానవ హక్కులు, గౌరవాన్ని కాపాడేలా వార్తా సంస్థలు, నెటిజన్లు ఎంతో సున్నితత్వంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాయి.

(The above story first appeared on LatestLY on Jul 30, 2026 12:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).