Kangana Ranaut Viral Video: కంగనా దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ యత్నం.. దిష్టిబొమ్మను లాక్కొని పారిపోయిన ఇన్‌స్పెక్టర్.. వైరల్ వీడియో ఇదిగో..

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యువత, మహిళల జీవనశైలిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా లక్నోలోని మాల్ అవెన్యూ కూడలి వద్ద ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన మహిళా కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు.

Kangana Ranaut Viral Video: కంగనా దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ యత్నం.. దిష్టిబొమ్మను లాక్కొని పారిపోయిన ఇన్‌స్పెక్టర్.. వైరల్ వీడియో ఇదిగో..
Kangana Ranaut Viral Video

Kangana Ranaut Viral Video: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యువత, మహిళల జీవనశైలిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా లక్నోలోని మాల్ అవెన్యూ కూడలి వద్ద ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన మహిళా కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నిరసన సందర్భంగా ఊహించని విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అభ్యంతరకర వీడియోలు పోస్ట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రీమాకు బిగ్ షాక్, దేశం విడిచి వెళ్లాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన ఖతార్ ప్రభుత్వం..

లక్నో పార్టీ కార్యాలయం వెలుపల కాంగ్రెస్ మహిళా నేతలు కంగనా దిష్టిబొమ్మకు నిప్పు పెట్టేందుకు సిద్ధమవుతుండగా.. విధి నిర్వహణలో ఉన్న ఒక యూపీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ చురుగ్గా వ్యవహరించారు. నిరసనకారుల మధ్యలోకి చొచ్చుకెళ్లి, సగం మండుతున్న దిష్టిబొమ్మ భాగాన్ని లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Congress Workers Flee After UP Police Stop Kangana Ranaut Effigy Burning Protest

కంగనా రనౌత్ దేశంలోని ఆడపిల్లలను, మహిళలను మురికివాడ తరం (జనరేషన్ గట్టర్) అని సంబోధిస్తూ తీవ్రంగా అవమానించారని, ఆమె వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ కేవలం ముసుగు ధరిస్తోందని వారు ఆరోపించారు.

తన వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలపై ఎంపీ కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ మీడియా.. సోకాల్డ్ ఫెమినిస్టులపై విరుచుకుపడ్డారు. భారత సమాజంలో పౌర స్పృహ, సాంస్కృతిక హుందాతనం ఎంతో అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.

సమాజంలో అసభ్యతకు తావులేదని, హుందాగా ప్రవర్తించలేని వారు తమ గదులకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. దేశంలో లక్షలాది మంది పిల్లలు ప్రధాని మోదీని తమ 'ఎగ్జామ్ బడ్డీ'గా భావిస్తుంటే.. చాలామంది ఆయనను నాయకుడిగా, మార్గదర్శకుడిగా, దేవుడిగా కొలుస్తారని పేర్కొన్నారు. కాబట్టి ప్రజా నాయకుల పట్ల, ప్రజల మనోభావాల పట్ల హుందాగా నడుచుకోవాలని ఆమె హితవు పలికారు.

(The above story first appeared on LatestLY on Jul 30, 2026 12:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).