Delhi Shocker: ఆటో ఎక్కగానే యువతిపై తెగబడిన ముగ్గురు కామాంధులు, ఢిల్లీ య‌మున బ్రిడ్జి స‌మీపంలో అత్యాచారానికి గురైన యువతి, రేప్ అనంతరం కశ్మీరీ గేట్ వ‌ద్ద వదిలేసి పరారయిన నిందితులు

దేశ రాజధానిలో అత్యాచారాలు ఆగడం లేదు. నిర్భయ ఘటన తర్వాత నిందితులను ఉరిశిక్ష తీసినా ఎటువంటి మార్పు కావడం లేదు. తాజాగా ఆటో ఎక్కిన యువతిపై డ్రైవ‌ర్‌తో స‌హా ముగ్గురు వ్య‌క్తులు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డడం ( Woman Gang-raped in Central Delhi) క‌ల‌క‌లం రేపింది.

Delhi Shocker: ఆటో ఎక్కగానే యువతిపై తెగబడిన ముగ్గురు కామాంధులు, ఢిల్లీ య‌మున బ్రిడ్జి స‌మీపంలో అత్యాచారానికి గురైన యువతి, రేప్ అనంతరం కశ్మీరీ గేట్ వ‌ద్ద వదిలేసి పరారయిన నిందితులు
Image used for representational purpose only | (Photo Credits: ANI)

New Delhi, Oct 4: దేశ రాజధానిలో అత్యాచారాలు ఆగడం లేదు. నిర్భయ ఘటన తర్వాత నిందితులను ఉరిశిక్ష తీసినా ఎటువంటి మార్పు కావడం లేదు. తాజాగా ఆటో ఎక్కిన యువతిపై డ్రైవ‌ర్‌తో స‌హా ముగ్గురు వ్య‌క్తులు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డడం ( Woman Gang-raped in Central Delhi) క‌ల‌క‌లం రేపింది. బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. యూపీలోని సంభాల్‌కు చెందిన తను ప‌నినిమిత్తం ఢిల్లీ వ‌చ్చింది.

శ‌నివారం ఉద‌యం క‌శ్మీరీ గేట్‌కు వెళ్లేందుకు ఖ‌జురిఖాస్‌లో ఆ మహిళ ఐటీఓ ప్రాంతంలో ఆటో ఎక్కింది. అయితే ఆ సమయంలో ఆటోడ్రైవ‌ర్‌ మహిళ చెప్పిన ప్రదేశానికి కాకుండా య‌మున బ్రిడ్జి స‌మీపంలోని ఓ రూమ్‌కు తీసుకువెళ్లి, అక్కడ అతనితో పాటు మరో ముగ్గరు తనపై సామూహిక లైంగిక దాడికి ( Woman Gang-raped) పాల్పడ్డారని తెలిపింది. అనంతరం తనని ఆ ఆటోడ్రైవ‌ర్ క‌శ్మీరీ గేట్ వ‌ద్ద వదిలేసి ప‌రారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది.

వీడు తండ్రేనా.. కూతురికి మద్యం తాగించి ఆపై లైంగిక దాడి, ఈ దారుణాన్ని వీడియో తీసిన అతని ప్రియురాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన కడప పోలీసులు

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవ‌ర్‌ను అరెస్ట్ (Autorickshaw Driver Arrested) చేయగా మిగిలిన నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరిక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యూపీలోని సంభాల్‌కు చెందిన బాధితురాలు ప‌నినిమిత్తం ఢిల్లీ వ‌చ్చింద‌ని పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Oct 04, 2021 08:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).