Fireworks Factory Explosion: తమిళనాడు బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు, ఐదుగురు సజీవ దహనం, మరికొందరికి తీవ్ర గాయాలు
తమిళనాడులోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు (Fireworks Plant Explosion Accident) సంభవించింది.. ఈ భారీ పేలుడు ధాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విరుదునగర్ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో (TamilNadu fireworks factory) శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
Chennai, Oct 23: తమిళనాడులోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు (Fireworks Plant Explosion Accident) సంభవించింది.. ఈ భారీ పేలుడు ధాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విరుదునగర్ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో (TamilNadu fireworks factory) శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
డి.కల్లూపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమ కుటుంబాలపై దేవుడు పగబట్టాడని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక్కడి ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుడులో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రసాయనాలు మిక్సింగ్ కావడం వల్లనే ఈ పేలుడు సంభవించిందని పోలీసులు చెబుతున్నారు. అందులో పనిచేస్తున్న ఇతర కార్మికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీసారు, విరుదునగర్ మరియు శ్రీవిల్లిపుత్తూర్ నుండి అగ్నిమాపక సేవా విభాగాలు మంటలను ఆర్పివేశాయి.
దీపావళి పండుగకు ముందే బాణసంచా కర్మాగారాల్లో భద్రతా చర్యలను ప్రభుత్వం నిర్ధారించాలని డిఎంకె అధ్యక్షుడు ఎం కె స్టాలిన్ డిమాండ్ చేశారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 23, 2020 05:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

