New Rule on Gold: బంగారు ఆభరణాలు కొంటున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు, జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన

నాణ్య‌త‌తో నిమిత్తం లేకుండా ప్ర‌తి జ్యువెల్ల‌రీ వ్యాపారి జూన్ ఒక‌టో తేదీ నుంచి హాల్‌మార్క్‌డ్ బంగారం ఆభ‌ర‌ణాలు విక్ర‌యించాల్సి ఉంటుంది. క్యార‌ట్ల‌తో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభ‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రిగా హాల్‌మార్క్‌డ్ చేసి విక్ర‌యించాల్సిందే. ఈ మేర‌కు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్ట్స్ గ‌త నెల నాలుగో తేదీన నోటిఫికేష‌న్ జారీ చేసింది.

New Rule on Gold: బంగారు ఆభరణాలు కొంటున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు, జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన
Gold Price, Representational Image | Photo Credits; IANS

New Delhi, May 28: నాణ్య‌త‌తో నిమిత్తం లేకుండా ప్ర‌తి జ్యువెల్ల‌రీ వ్యాపారి (Jewellery) జూన్ ఒక‌టో తేదీ నుంచి హాల్‌మార్క్‌డ్ (Hallmark) బంగారం ఆభ‌ర‌ణాలు విక్ర‌యించాల్సి ఉంటుంది. క్యార‌ట్ల‌తో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభ‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రిగా హాల్‌మార్క్‌డ్ చేసి విక్ర‌యించాల్సిందే. ఈ మేర‌కు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్ట్స్ (BIS) గ‌త నెల నాలుగో తేదీన నోటిఫికేష‌న్ జారీ చేసింది. 14 క్యార‌ట్లు, 18 క్యార‌ట్లు, 20 క్యార‌ట్లు, 23 క్యార‌ట్లు, 24 క్యారట్ల బంగారంపై (Gold) హాల్‌మార్కింగ్ వాడుతున్నారు. 21 క్యార‌ట్లు లేదా 19 క్యార‌ట్ల బంగారం ఆభ‌ర‌ణాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు హాల్‌మార్కింగ్ లేదు. కానీ, జూన్ ఒక‌టో తేదీ నుంచి నిబంధ‌న‌లు మారిపోతున్నాయ్‌. జూన్ ఒక‌టో తేదీ నుంచి బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ (BIS) హాల్ మార్కింగ్ లేకుండా బులియ‌న్ (Bullion) వ్యాపారులు ఏ బంగారం ఆభ‌ర‌ణాన్ని విక్ర‌యించ‌రాదు.

₹ 2,000 Currency Notes: భారీగా పడిపోయిన 2వేల నోట్ల చలామణి, త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం, ప్రస్తుతం చలామణిలో ఉన్న రెండువేల నోట్లు ఎన్నో తెలుసా? 

ఏ వ్య‌క్తైన 12 క్యార‌ట్లు లేదా 16 క్యార‌ట్ల బంగారం ఆభ‌ర‌ణం కొనాల‌నుకున్నా.. జ్యువెల్ల‌రీ షాప్ య‌జ‌మాని తొలుత బీఐఎస్ హాల్‌మార్కింగ్ సెంట‌ర్ నుంచి హాల్‌మార్కింగ్ చేసిన త‌ర్వాతే విక్ర‌యించాల్సి ఉంటుంద‌ని పీఎస్ఎల్ అడ్వొకేట్స్ అండ్ సొలిసిట‌ర్స్ మేనేజింగ్ పార్ట‌న‌ర్ స‌మీర్ జైన్ తెలిపారు.

Bank Holidays in June: జూన్‌లో బ్యాంకులకు 11రోజులు సెలవులు, ఇవి తెలుసుకోకుండా వెళ్తే అంతే సంగతులు, జూన్ నెలలో బ్యాంకు సెలవుల పూర్తి వివరాలు ఇవిగో! 

బంగారం ఆభ‌ర‌ణం ప్యూరిటీ గుర్తింపు ల‌క్ష‌ణాల‌ను కేంద్రం స‌వ‌రించింది. హాల్‌మార్క్‌డ్ బంగారం ఆభ‌ర‌ణాల‌పై మూడు గుర్తులు ఉంటాయి. వాటిలో బీఐఎస్ లోగో, ప్యూరిటీ లేదా ఫైనెస్ గ్రేడ్‌, ఆరంకెల అల్ఫాన్యూమ‌రిక్ కోడ్ (హ్యుడ్ HUID ) ఉంటాయి. బీఐఎస్ లోగో, ప్యూరిటీ లేదా ఫైనెస్ గ్రేడ్‌తోపాటు ఎస్సే సెంట‌ర్ ఐడెంటిఫికేష‌న్ మార్క్‌, బంగారం వ్యాపారి ఐడెంటిపికేష‌న్ నంబ‌ర్ ఉంటాయి.

(The above story first appeared on LatestLY on May 28, 2022 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).