CM Vijay Rupani Collapses on Stage: స్టేజ్ మీదనే హఠాత్తుగా కుప్పకూలిన గుజరాత్ సీఎం, అహ్మదాబాద్ ఆసుపత్రికి విజయ్ రూపానీని తరలింపు, ఇతర బహిరంగ సభలను రద్దు, మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (64) వేదికపైనే హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వడోదరలోని నిజాంపుర ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో అస్వస్థతకు గురైన ఆయన (CM Vijay Rupani Collapses on Stage) స్టేజ్‌పైనే పడిపోయారు.
Gandhi Nagar, Feb 15: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (64) వేదికపైనే హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వడోదరలోని నిజాంపుర ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో అస్వస్థతకు గురైన ఆయన (CM Vijay Rupani Collapses on Stage) స్టేజ్‌పైనే పడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అక్కడ ప్రథమ చిక్సిత అనంతరం ఆయన్ని అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇతర బహిరంగ సభలను సీఎం రద్దు చేసుకున్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీసారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానిక బీజేపీ నాయకులు వెల్లడించారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో (poll rally in Vadodara) ప్రసంగిస్తుండగా సీఎంకు కళ్లు తిరిగాయనీ దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పడిపోకుండా పట్టుకున్నారనీ బీజేపీ నేత భరత్ తెలిపారు. అనంతరం ఆయనను వడోదర నుంచి అహ్మదాబాద్‌కు హెలికాప్టర్‌లో తరలించామన్నారు. కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం దెబ్బతిందన్నారు.
ANI Tweet
His (Gujarat CM Vijay Rupani's) condition is stable. All his medical check-up reports including EGC and CT Scan are normal. There is nothing to worry about. He will be kept at the hospital for 24 hours just for observation: Dr RK Patel, Director, UN Mehta hospital in Ahmedabad pic.twitter.com/pTv3kv9Xdx
— ANI (@ANI) February 14, 2021
లో బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరిసించి పోయారని వైద్యులు తెలిపారని చెప్పారు. కాగా గుజరాత్‌లోని వడోదరతో సహా కీలకమైన ఆరుమునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి. మునిసి పాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి.
(The above story first appeared on LatestLY on Feb 15, 2021 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

