Gujarat Shocker: ఏడాది నుంచి నాతో సెక్స్ చేయడం లేదు, పైగా బీరు తాగమని నా భర్త పదే పదే హింసిస్తున్నాడు, గుజరాత్‌లో సైకోలో మారిన ఎన్నారై, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన అతని భార్య
గుజరాత్ రాష్ట్రంలో దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ఎన్నారై భర్త నుండి రక్షించాలని కోరుతూ అతని భార్య (Gujarat Woman) పోలీసులను ఆశ్రయించింది. అహమ్మదా బాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళకు 2016లో వివాహం అయ్యింది. ఏడాది తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయ్‌కు వెళ్లింది. ఇండియాలో ఉన్నన్ని రోజులు తనను బాగానే చూసుకున్న భర్త దుబాయ్ వెళ్లిన నాటి నుంచి హింసించడం ప్రారంభించాడు.
Gandhi Nagar, Mar 31: గుజరాత్ రాష్ట్రంలో దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ఎన్నారై భర్త నుండి రక్షించాలని కోరుతూ అతని భార్య (Gujarat Woman) పోలీసులను ఆశ్రయించింది. అహమ్మదా బాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళకు 2016లో వివాహం అయ్యింది. ఏడాది తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయ్‌కు వెళ్లింది. ఇండియాలో ఉన్నన్ని రోజులు తనను బాగానే చూసుకున్న భర్త దుబాయ్ వెళ్లిన నాటి నుంచి హింసించడం ప్రారంభించాడు.
సైకోలా మారి అదనపు కట్నం తేవాల్సిందిగా బాధితురాలిని వేధింపులకు గురి చేసేవాడు. ప్రతి రోజు తాగి నరకం చూపించేవాడు. అతంటితో ఊరుకోక భార్య చేత బలవంతంగా బీర్ తాగించేందుకు ప్రయత్నించేవాడు. అంతే కాకుండా తన రెండేళ్ల కుమార్తె చేత బీర్ (Forced Infant Daughter to Drink Beer) తాగించేవాడు. ఇక ఏడాదిగా భార్యతో శృంగారానికి (Her Husband Deprived Her of Sex For A Year) కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం అని తేల్చి చెప్పాడు.
ఇక బిడ్డకు, బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. మందులిప్పించడం వంటివి చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది బాధితురాలు. భర్త ఆమెను తన పుట్టింట్లో వదిలేసి దుబాయ్ చెక్కెశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన మహిళ అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది.
(The above story first appeared on LatestLY on Mar 31, 2021 03:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

