New Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు, మాజీ ఐఏఎస్‌ జ్ఞానేష్‌కుమార్‌,రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుఖ్‌భీర్‌ సింగ్‌ సంధు ఎంపిక

భారత ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు కమిషనర్ల నియామకమయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్‌ జ్ఞానేష్‌కుమార్‌, పంజాబ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుఖ్‌భీర్‌ సింగ్‌ సంధును ఎంపిక చేశారు.

New Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు, మాజీ ఐఏఎస్‌ జ్ఞానేష్‌కుమార్‌,రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుఖ్‌భీర్‌ సింగ్‌ సంధు ఎంపిక
Election Commission (File Photo)

భారత ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు కమిషనర్ల నియామకమయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్‌ జ్ఞానేష్‌కుమార్‌, పంజాబ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుఖ్‌భీర్‌ సింగ్‌ సంధును ఎంపిక చేశారు. కాగా గత నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల రాజీనామాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఈసీఐలో మిగిలారు. తాజాగా ఇద్దరు కమిషనర్లను సెలక్షన్ కమిటీ నియమించింది. రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు.

Here's ANI Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 14, 2024 02:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).