Hardik Pandya Divorce: భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన హార్డిక పాండ్యా, అంతా అనుకున్నట్లే విడాకులు తీసుకున్న పాండ్యా దంపతులు
టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు (Hardik Pandya Divorce) తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. గత కొంత కాలంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
New Delhi, July 18: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు (Hardik Pandya Divorce) తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. గత కొంత కాలంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నటాషా స్టాంకోవిచ్ (Natasa Stankovic) కుమారుడు అగస్త్యను తీసుకొని ఇటీవల ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబయి విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు హార్దిక్ ప్రకటించాడు.
View this post on Instagram
2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో పాండ్య.. సెర్బియా నటి అయిన నటాషా చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భిణి అని సోషల్‌మీడియాలో పెట్టినప్పుడే అతడికి పెళ్లైందని తెలిసింది. అదే ఏడాది జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అప్పుడు కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్ పద్ధతుల్లో వివాహమాడారు.
(The above story first appeared on LatestLY on Jul 18, 2024 10:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

