vitamin d

విటమిన్ డి అనేది మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన విటమిన్ ఇది అనేక రకాల జబ్బులు రాకుండా ఉంచుతుంది. మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ గా డి విటమిన్ ని చెప్పవచ్చు. కండరాల పెరుగుదలకు ఎముకల బలానికి డి విటమిన్ సహాయపడుతుంది. అయితే డి విటమిన్ లోపం వల్ల ఎటువంటి జబ్బులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విటమిన్ డి లోపం వల్ల ముఖ్యంగా మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందదు ఇది క్యాల్షియం నీ గ్రహించుకునే కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి డి విటమిన్ లోపం వల్ల కూడా విటమిన్ బి 12 ఇబ్బందికి గురికావాల్సి వస్తుంది. దీని వల్ల కూడా ఎర్ర రక్త కణాలు ఏర్పడవు కాబట్టి అనేక రకాల జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది.

రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది- విటమిన్ డి లోపం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు వస్తాయి. అంతేకాకుండా విటమిన్-డి లోపం వల్ల కండరాల పెరుగుదల ఉండదు. క్యాల్షియం సంగ్రహణ ఉండదు. దీని ద్వారా ఎముకల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విటమిన్ డి లో పని ఎలా అధిగమించాలి- విటమిన్ డి మనకు సూర్య రష్మి ద్వారా అందుతుంది కాబట్టి మీరు ప్రతి రోజు ఉదయం ,సాయంత్రం సమయంలో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉన్నట్లయితే మీకు డి విటమిన్ లభిస్తుంది. అంటే కాకుండా కొన్ని రకాల సప్లిమెంట్స్ ద్వారా కూడా డి విటమిన్ లోపాన్ని మనం అధిగమించవచ్చు దీనికోసం మీరు వైద్యుల్ని సంప్రదించి వైద్యులు సలహా మేరకు డి విటమిన్ సప్లమెంటును వాడడం మంచిది.

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ బి 12 లోపం ...

విటమిన్ డి కోసం తీసుకోవలసిన ఆహార పదార్థాలు- అరటి ,కివి, బొప్పాయ, దానిమ్మవంటి ఆహార పదార్థాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. మీరు ప్రతి రోజు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా డి విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు.

చేపలు- చేపలలో కూడా డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ట్యూనా, సాల్మన్, వంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే డి విటమిన్ లోపం నుండి బయటపడవచ్చు.

అంతేకాకుండా పుట్టగొడుగులు కోడిగుడ్లు వంటి వాటిల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే డి విటమిన్ లోపం నుండి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి