Elephants Drink Country Liquor: కుండల కొద్దీ ఫుల్లుగా నాటు సారా తాగి గ్రామస్తులకు చుక్కలు చూపించిన ఏనుగుల గుంపు, వాటిని అడవిలోకి పంపించేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చిందంటున్న స్థానికులు
సారా కోసం పానీయాన్ని సిద్ధం చేసేందుకు వచ్చిన గ్రామస్తులు.. ఏనుగులు ఆదమరచి నిద్రపోవడం చూసి కంగుతిన్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, ఎంతకీ గజరాజులు (Elephants) లేవలేదు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి డప్పులు కొట్టి శబ్ధం చేయడంతో ఏనుగులు లేచాయి. తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి.
Keonjhar, NOV 10: ఒడిషాలో ఓ ఏనుగుల (Elephants) మంద కియోంఝర్ జిల్లా (Keonjhar) వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఊర్ల మీద పడి భారీగా ఆస్తి నష్టం చేస్తున్నాయి. కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాదు...ఏకంగా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా కియోంఝర్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వార్నీ.. అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. గజరాజులు అదే ఏనుగులు.. నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి. ఏనుగులు ఏంటి? నాటుసారా తాగి మత్తులో (Drink Country Liquor) ఊగడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. మ్యాటర్ ఏంటంటే.. అడవిలో పులియబెట్టిన సారాను ఏనుగుల మంద(24 గజరాజులు) తాగేసింది. ఆ తర్వాత మత్తులో అలాగే నిద్రించాయి.
సారా కోసం పానీయాన్ని సిద్ధం చేసేందుకు వచ్చిన గ్రామస్తులు.. ఏనుగులు ఆదమరచి నిద్రపోవడం చూసి కంగుతిన్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, ఎంతకీ గజరాజులు (Elephants) లేవలేదు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి డప్పులు కొట్టి శబ్ధం చేయడంతో ఏనుగులు లేచాయి. తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి.
”మేము సారా సిద్ధం చేయడానికి ఉదయం 6 గంటలకు అడవిలోకి వెళ్ళాము. అక్కడ కుండలన్నీ పగలగొట్టబడి ఉన్నాయి. పులియబెట్టిన నీరు కనిపించలేదు. ఆ పక్కనే 24 ఏనుగులు ఆదమరిచి నిద్రపోతూ కనిపించాయి. అవి పులియబెట్టిన నీటిని తాగేశాయి. ఆ మద్యం ప్రాసెస్ చేయబడలేదు. మేము జంతువులను మేల్కొలపడానికి ప్రయత్నించాము, కానీ విఫలమయ్యాము. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాము” అని ఓ గ్రామస్తుడు తెలిపాడు. ఏనుగుల మందలో 9 ఆరు ఆడ ఏనుగులు, 9 కూన ఏనుగులు ఉన్నాయి.
(The above story first appeared on LatestLY on Nov 10, 2022 09:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).