India First LNG Train: వీడియో ఇదిగో.. సబర్మతి రైల్వే స్టేషన్‌ నుంచి పరుగులు పెట్టిన తొలి LNG రైలు ..40 శాతం వరకు డీజిల్ వినియోగం తగ్గింపు.. ప్రత్యేకతలు ఇవే..

భారతీయ రైల్వే రవాణా రంగంలో పర్యావరణ అనుకూల, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం దిశగా మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొదటిసారిగా డీజిల్ మరియు ద్రీవికృత సహజ వాయువు (LNG) డ్యూయల్-ఫ్యూయల్ సాంకేతికతతో పనిచేసే రైలు అధికారికంగా పట్టాలెక్కింది.

India First LNG Train: వీడియో ఇదిగో.. సబర్మతి రైల్వే స్టేషన్‌ నుంచి పరుగులు పెట్టిన తొలి LNG రైలు ..40 శాతం వరకు డీజిల్ వినియోగం తగ్గింపు.. ప్రత్యేకతలు ఇవే..
India First LNG Train.jpg

India First LNG Train: భారతీయ రైల్వే రవాణా రంగంలో పర్యావరణ అనుకూల, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం దిశగా మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొదటిసారిగా డీజిల్ మరియు ద్రీవికృత సహజ వాయువు (LNG) డ్యూయల్-ఫ్యూయల్ సాంకేతికతతో పనిచేసే రైలు అధికారికంగా పట్టాలెక్కింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పరిధిలోని సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వినూత్న రైలును జెండా ఊపి ప్రారంభించగా, ఇది సబర్మతి నుంచి మెహసానా మార్గంలో తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి జీతం, PF, బ్యాంకింగ్‌పై కీలక మార్పులు..

ఈ కొత్త రైలు ఎనిమిది కోచ్‌లతో కూడిన డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) ర్యాక్. దీనిలోని రెండు 1,400 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన డ్రైవింగ్ పవర్ కార్లను డీజిల్ మరియు LNG రెండింటితో నడిచేలా అత్యాధునిక సాంకేతికతతో మార్పు చేశారు. ప్రతి పవర్ కారులోనూ అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎల్‌ఎన్‌జీని సురక్షితంగా నిల్వ చేసేందుకు ప్రత్యేకమైన క్రయోజెనిక్ ట్యాంక్‌ను అమర్చారు. ఈ రైలును ప్రజల అందుబాటులోకి తేవడానికి ముందు రైల్వే అధికారులు సుమారు 2,000 కిలోమీటర్లకు పైగా క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించి, ఇంజిన్ పనితీరును నిర్ధారించుకున్నారు.

India First LNG Train Launched

ఈ డ్యూయల్-ఫ్యూయల్ సాంకేతికత వల్ల డీజిల్ వినియోగం దాదాపు 40 శాతం వరకు తగ్గుతుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల ప్రతి డ్రైవింగ్ పవర్ కారుకు ఏడాదికి రూ.11.9 లక్షల వంతున, ఎనిమిది కోచ్‌ల మొత్తం ర్యాక్‌పై ఏడాదికి రూ.23.9 లక్షల వరకు ఇంధన వ్యయం ఆదా కానుంది. అంతేకాకుండా కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి హానికర ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే, ఎల్‌ఎన్‌జీ కూడా శిలాజ ఇంధనమే కావడం వల్ల దీనిని పూర్తి 'జీరో-ఎమిషన్' రైలుగా పరిగణించలేకపోయినా, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఇటీవల దేశంలో ప్రవేశపెట్టిన ఫ్యూయల్ సెల్ ఆధారిత 'హైడ్రోజన్ రైలు' విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకుని నడుస్తుంది. కానీ ఈ ఎల్‌ఎన్‌జీ రైలులో మాత్రం సంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్లనే డ్యూయల్ ఫ్యూయల్ విధానానికి అనుగుణంగా మార్చి ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి విద్యుదీకరణ కాని రైల్వే మార్గాల్లో డీజిల్ వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రాజెక్టు ఒక సరికొత్త మార్గాన్ని చూపిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 29, 2026 04:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).