Coronavirus in India: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ త్వరలోనే ముగిసే అవకాశం, క్రమంగా తగ్గుతున్న డైలీ కేసులు, నిన్నటితో పోలిస్తే 20వేలు తగ్గిన రోజువారీ కేసులు
భారత్ లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు క్రమంగా దిగివస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే కేసులు 20వేలు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,07,474 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే 865 మంది కరోనా బారిన మృతి చెందారు(Corona Deaths).
New Delhi Feb 06: భారత్ లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు క్రమంగా దిగివస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే కేసులు 20వేలు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,07,474 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే 865 మంది కరోనా బారిన మృతి చెందారు(Corona Deaths). ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 2,13,246 మంది కరోనా మహమ్మారి భారి నుంచి కోలుకున్నారు. యాక్టీవ్ కేసుల సంఖ్య(Corona Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12,25,011 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక నిన్న నమోదైన 865 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,01,979 కు చేరింది. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate)నిన్నటితో పోలిస్తే తగ్గింది. ప్రస్తుతం 7.42 శాతంగా ఉంది.
India reports 1,07,474 fresh #COVID19 cases, 2,13,246 recoveries and 865 deaths in the last 24 hours.
Active cases: 12,25,011
Death toll: 5,01,979
Daily positivity rate:7.42%
Total vaccination: 1,69,46,26,697 pic.twitter.com/jbbqjX9NQz
— ANI (@ANI) February 6, 2022
ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర ల్లో కరోనా రోజువారీ కేసుల అత్యధికంగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలో కూడా ఈ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో ఢిల్లీలో ఆంక్షలను క్రమంగా సడలించారు. అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రికాషన్ డోసు (Precaution dose), యువజనులకు వ్యాక్సినేషన్ (Vaccination) వంటి ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,69,46,26,697 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
(The above story first appeared on LatestLY on Feb 06, 2022 10:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

