Coronavirus in India: భారత్‌లో తగ్గుతున్న కరోనా తీవ్రత, రోజురోజుకూ తగ్గుతున్న కోవిడ్ కేసులు, వరుసగా నాలుగో రోజు కూడా వెయ్యికి పైగా మరణాలు నమోదు
భారత్ లో కరోనా థర్డ్ వేవ్ (Corona Third wave) క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,27,952 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా వెయ్యికి పైగా మరణాలు (Corona Deaths)నమోదయ్యాయి.
New Delhi Feb 05: భారత్ లో కరోనా థర్డ్ వేవ్ (Corona Third wave) క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,27,952 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా వెయ్యికి పైగా మరణాలు (Corona Deaths)నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 2,30,814 మంది కరోనా మహమ్మారి భారి నుంచి కోలుకున్నారు. యాక్టీవ్ కేసుల సంఖ్య(Corona Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,31,648 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక నిన్న నమోదైన 1059 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5, 01,114 కు చేరింది. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) 7.98 శాతంగా ఉంది.
India reports 1,27,952 fresh #COVID19 cases, 2,30,814 recoveries, and 1059 deaths in the last 24 hours.
Active cases: 13,31,648
Death toll: 5,01,114
Daily positivity rate: 7.98%
Total vaccination: 1,68,98,17,199 pic.twitter.com/HAWlsyMnp0
— ANI (@ANI) February 5, 2022
ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర ల్లో కరోనా రోజువారీ కేసుల అత్యధికంగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలో కూడా ఈ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో ఢిల్లీలో ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రికాషన్ డోసు (Precaution dose), యువజనులకు వ్యాక్సినేషన్ (Vaccination) వంటి ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,68,98,17,199 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
(The above story first appeared on LatestLY on Feb 05, 2022 09:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

