Covid in India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ, గత 24 గంటల్లో 3,038 కొత్త కేసులు నమోదు, ప్రస్తుతం దేశంలో 21,179 కేసులు యాక్టివ్‌

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Ministry Of India) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64,740 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,038 కొత్త కేసులు బయటపడ్డాయి.

Covid in India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ, గత 24 గంటల్లో 3,038 కొత్త కేసులు నమోదు, ప్రస్తుతం దేశంలో 21,179 కేసులు యాక్టివ్‌
Coronavirus (Photo-ANI)

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Ministry Of India) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64,740 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,038 కొత్త కేసులు బయటపడ్డాయి.దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,29,284కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,179 కేసులు యాక్టివ్‌గా (Active Cases) ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు కొవిడ్‌ (Covid-19) నుంచి 4,41,77,204 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్‌, కేరళలో ఇద్దరు చొప్పున, జమ్మూ కశ్మీర్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,901 కి చేరింది.

మరో వడ్డనకు ఆర్బీఐ సిద్ధం.. వడ్డీ రేట్లు మళ్లీ పెంచే ఛాన్స్‌.. ఆందోళనలో సామాన్యులు.. తొమ్మిది నెలల వ్యవధిలో ఇప్పటికే, 2.50 శాతం పెరిగిన వడ్డీ రేటు

ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.05 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Ministry Of India) అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.76 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Apr 04, 2023 12:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).