Hyderabad, April 4: ద్రవ్యోల్బణం పేరిట ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను (Interest Rates) పెంచిన రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) మరో సారి అదే దారిలో సాగనున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ-MPC) సమావేశం ప్రారంభమయ్యింది. తాజా భేటీలో మరో 25 బేసిస్ పాయింట్ల (Basic Points) (పావు శాతం) పెంచవచ్చన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. గృహ, ఆటో రుణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే రెపో రేటును 2022 మే నుంచి మొదలుపెట్టి, ఇప్పటివరకూ 2.50 శాతం పెంచారు. ఈ పెంపు ప్రక్రియలో ఏప్రిల్ 6న పెరగబోయేదే చివరిది కావచ్చన్న ఆశాభావం పరిశ్రమ, మార్కెట్ వర్గాల్లో ఉంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజులపాటు సమావేశమై (ఏప్రిల్ 3,5,6) వివిధ దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాల్ని, ధరల తీరును చర్చిస్తుంది.
RBI may hike repo rate by 25 bps: Poll | Mint - Mint https://t.co/NLXNqgKgPK via @GoogleNews
— Tanneeru Venkateswararao Tanneeru (@TTanneeru) April 3, 2023
నిర్ణయాలు గురువారం వెల్లడి
దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 6.52 శాతం, ఫిబ్రవరిలో 6.44 శాతం చొప్పున నమోదయ్యింది. వివిధ కేంద్ర బ్యాంక్‌లు ఇటీవలి సమీక్షల్లో మరోసారి వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సైతం రెపో రేటును మరో పావుశాతం పెంచుతుందని అంచనా వేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తొలి ద్వైమాసిక పాలసీపై ఆరుగురు సభ్యులు కలిగిన కమిటీ తీసుకున్న నిర్ణయాలను గురువారం గవర్నర్ వెల్లడిస్తారు.