UPI transaction limit for income tax payments increse to Rs 1 lakh to Rs 5 lakh (X)

Hyd, Aug 8:  ద్రవ్య పరమతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక రేపో రేటును 6.5% వద్దనే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు రోజుకు యూపీఐ పేమెంట్స్ లిమిట్ రూ.1 లక్ష మాత్రమే ఉండగా దానిని రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు జరిపేవారు రూ.5 లక్షల వరకు యూపీఏ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపారు గవర్నర్ శక్తికాంత దాస్. తొమ్మిదో పాలసీ మీటింగ్‌లో కూడా బెంచ్‌మార్క్ ఇంట్రెస్ట్‌ రేటుని మార్చలేదు.

వైద్య ఖర్చులు, విద్యాసంస్థల్లో ఫీజులను యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. యూపీఐలో డెలిగేటెడ్ చెల్లింపుల వ్యవస్థను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది ఆర్బీఐ. ఏపీకి మరో మూడు రోజులు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక, దంచికొడుతున్న వానలు

దీంతో ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి నిర్దేశిత పరిమితి వరకు యూపీఐ లావాదేవీ చేసేందుకు మరొక వ్యక్తికి అనుమతిని ఇవ్వవచ్చు. ఈ రెండో వ్యక్తికి యూపీఐకి అనుసంధానించిన బ్యాంకు ఖాతా ఉండవలసిన అవసరం లేదు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఈ సదుపాయాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించింది ఆర్బీఐ.