Coronavirus in India: మూడు లక్షలు దాటిన డైలీ కరోనా కేసులు, తగ్గినట్లే తగ్గి...విజృంభిస్తున్న మహహ్మారి, పదివేలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు

భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ (Third wave) కొనసాగుతోంది. కరోనా డైలీ కేసులు మూడు లక్షలు దాటాయి. గత రెండు రోజులుగా తగ్గిన కరోనా కేసులు (Daily corona cases), ఒక్కసారిగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,17,532 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ(Health Ministry of India) తెలిపింది.

Coronavirus in India: మూడు లక్షలు దాటిన డైలీ కరోనా కేసులు, తగ్గినట్లే తగ్గి...విజృంభిస్తున్న మహహ్మారి, పదివేలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు
Coronavirus Death Toll in India (Photo-IANS)

New Delhi January 20: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ (Third wave) కొనసాగుతోంది. కరోనా డైలీ కేసులు మూడు లక్షలు దాటాయి. గత రెండు రోజులుగా తగ్గిన కరోనా కేసులు (Daily corona cases), ఒక్కసారిగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,17,532 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ(Health Ministry of India) తెలిపింది. మరో వైపు కరోనాతో 491 మరణాలు(corona deaths) నమోదయ్యాయి. అటు కరోనా(Corona) నుంచి 2,23,990 మంది కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతంగా ఉందని తెలిపింది.

ఇక ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant)మాత్రం ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 9,287 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 3.63 శాతం పెరిగాయి. అటు వ్యాక్సినేషన్(Corona vaccination) ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 160 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

(The above story first appeared on LatestLY on Jan 20, 2022 09:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).