Coronavirus in India: భారత్‌లో ముగింపు దశలో కరోనా థర్డ్ వేవ్, తగ్గుతున్న రోజువారీ కరోనా కేసులు, 170 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ, కేరళలో భారీగా నమోదవుతున్న మరణాలు
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 71,365 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 1,217 మంది కరోనా బారిన మృతి చెందారు(Corona Deaths). ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది.
New Delhi Feb 09: భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 71,365 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 1,217 మంది కరోనా బారిన మృతి చెందారు(Corona Deaths). ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 1,72,211 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
యాక్టీవ్ కేసుల సంఖ్య(Corona Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,92,828 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక నిన్న నమోదైన 1,217 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,05,279 కు చేరింది. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) నిన్నటితో పోలిస్తే తగ్గింది. ప్రస్తుతం 4.54 శాతంగా ఉంది.
India reports 71,365 fresh #COVID19 cases, 1,72,211 recoveries and 1,217 deaths in the last 24 hours.
Active cases: 8,92,828 (2.11%)
Death toll: 5,05,279
Daily positivity rate: 4.54%
Total vaccination: 1,70,87,06,705 pic.twitter.com/9rtuxfM4dj
— ANI (@ANI) February 9, 2022
ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర ల్లో కరోనా రోజువారీ కేసుల అత్యధికంగా నమోదవుతున్నాయి. కేరళలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో ఢిల్లీలో ఆంక్షలను సడలించారు. అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 170 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రికాషన్ డోసు (Precaution dose), యువజనులకు వ్యాక్సినేషన్ (Vaccination) వంటి ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది.
(The above story first appeared on LatestLY on Feb 09, 2022 09:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

