COVID19 in India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 96,424 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 52 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 84 వేలు దాటిన కరోనా మరణాలు

శుక్రవారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,065,728 గా ఉండగా, మరణాలు 9,44,604కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది....

COVID19 in India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 96,424 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 52 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 84 వేలు దాటిన కరోనా మరణాలు
COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, September 18:  భారతదేశంలో కరోనావైరస్ వీరవిహారం చేస్తోంది. ఒకరోజుని మించి ఒకరోజు రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ప్రతిరోజు లక్షకు చేరువగా కొత్త కేసులు నమోదవుతుండంతో రోజురోజుకి భారత్ యొక్క కొవిడ్ సంఖ్య ఒక లక్ష పెరుగుతూపోతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నాటికి భారతదేశ కొవిడ్ కేసుల సంఖ్య 52 లక్షల మార్కును దాటేసింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 96,424  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 52,14,677 కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,174 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 84,372 కు పెరిగింది.

మరోవైపు  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 87,472 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 41,12,552 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 10,17,754 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఇక సెప్టెంబర్ 17 వరకు దేశవ్యాప్తంగా 6,15,72,343 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,06,615 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య  30 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు  9,44,000 కు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

శుక్రవారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య  30,065,728 గా ఉండగా, మరణాలు  9,44,604కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on Sep 18, 2020 10:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).