Interest on Loans: మొత్తం వడ్డీ మాఫీ సాధ్యం కాదు, చక్రవడ్డీ వసూలు ఆపేయండి, బ్యాంకులకు సుప్రీం కీలక ఆదేశాలు, ఆరు నెలల మారటోరియం పిటిషన్‌పై కీలక తీర్పును వెలువరించిన అత్యున్నత ధర్మాసనం
కరోనా కారణంగా గతేడాది బ్యాంకు రుణాలపై ఆరు నెలల మారటోరియం విధించిన విషయం విదితమే.ఈ కాలానికిగాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం (loan moratorium) కాలాన్ని పొడిగించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం తన తీర్పు వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
New Delhi, Mar 22: కరోనా కారణంగా గతేడాది బ్యాంకు రుణాలపై ఆరు నెలల మారటోరియం విధించిన విషయం విదితమే.ఈ కాలానికిగాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం (loan moratorium) కాలాన్ని పొడిగించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం తన తీర్పు వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
మంగళవారం తన తీర్పును ప్రకటించిన సుప్రీం వడ్డీని (Interest on Loans) పూర్తిగా మాఫీ చేయలేమని పేర్కొంది. అలాగే మాలాఫైడ్, ఏకపక్షంగా ఉంటే తప్ప కేంద్రం ఆర్థిక నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయలేమని పేర్కొంది. ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని లేదా కేంద్ర బ్యాంకును ఆదేశించలేమని, ప్రత్యేక రంగాలకు ఉపశమనం అడగలేమని కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.
చక్రవడ్డీ వసూలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, సుభాష్ రెడ్డి, ఆర్‌షా కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. వడ్డీ మినహాయింపుపై వడ్డీని రూ .2 కోట్ల వరకు కేంద్రం పరిమితం చేసిందని సుప్రీం గుర్తు చేసింది. అలాగే ఈ ఆరు నెలల కాలానికి రుణ గ్రహీతలనుంచి చక్రవడ్డీ వసూలు చేయొద్దని తెలిపింది. మారటోరియం కాలాన్ని పొడిగించడం, మొత్తం వడ్డీ మాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఖాతాదారులకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి, మరి అలాంటప్పుడు బ్యాంకులు రుణాలపై పూర్తిగా వడ్డీని ఎలా మాఫీ చేయగలవని సుప్రీం ప్రశ్నించింది.
గతేడాది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) విధించిన మారటోరియం 2020 ఆగస్టుతో ముగిసింది. రుణాలపై వడ్డీ వసూళ్ల మీద మారటోరియం పొడిగించడానికి కేంద్ర ఆర్ధికశాఖ, ఆర్బీఐ నిరాకరించాయి. ఇప్పటికే రూ.2 కోట్ల వరకు రుణాలపై కేంద్రం వడ్డీ మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 వరకు ఉన్న మారటోరియం కాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.2 కోట్లవరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. కరోనా మహమ్మారి కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా నష్టపోయిందని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయని గుర్తు చేసింది.
గతేడాది కరోనా కారణంగా మార్చి నుంచి ఆగస్ట్ 31 వరకు రుణాలపై మారటోరియం విధిస్తున్నట్లు మార్చి 27న ఆర్బీఐ ప్రకటించింది. ఈ ఆరు నెలల సమయంలో వడ్డీపై వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తే అది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, బ్యాంకుల ఆర్థిక వనరులకు పెద్ద దెబ్బ పడుతుందని ఆర్బీఐ వాదించింది.
(The above story first appeared on LatestLY on Mar 23, 2021 03:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

