IT Raids In Dil Raju House Over (Credits: X)

Hyderabad, Jan 24: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు (Dil Raju) చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు (IT Raids) ఎట్టకేలకు ముగిశాయి. మంగళవారం ఉదయమే 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో మంగళవారం మొదలైన ఈ తనిఖీలు గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఆదాయం, చెల్లింపుల్లో కొన్ని తేడాలను గుర్తించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Here's Video:

వీళ్ల ఇండ్లల్లో కూడా

దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై, మైత్రీ మూవీస్ కార్యాలయం, డైరెక్టర్ సుకుమార్, మాంగో మీడియా ఆఫీసుల్లో  కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు యూఎస్ పౌరసత్వం రద్దు, లక్షలాది మంది భారతీయుల మెడపై వేలాడుతున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ కత్తి, అసలైంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ?

నేడు ‘దిల్ రాజు’ ప్రెస్ మీట్

ఐటీ సోదాలపై నేడు దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన గేమ్ చేంజర్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలు ఇటీవల విడుదల అవ్వడం, అవి రెండూ దిల్ రాజు కాంపౌండ్ మూవీలే కావడం తెలిసిందే.