Boy Dies of Cardiac Arrest: 12 ఏళ్లకే గుండెపోటు, నిద్రలోనే ఉలిక్కిపడిలేచి విలవిలలాడిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూత
కర్ణాటకలోని మడికేరిలో పన్నెండేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్ట్‌తో (Boy Dies of Cardiac Arrest) కన్నుమూశాడు. కుశాల్‌నగర్‌లో కూడుమంగళూరు గ్రామంలో ఆదివారం వేకువ ఝామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
Madikeri, Jan 9: కర్ణాటకలోని మడికేరిలో పన్నెండేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్ట్‌తో (Boy Dies of Cardiac Arrest) కన్నుమూశాడు. కుశాల్‌నగర్‌లో కూడుమంగళూరు గ్రామంలో ఆదివారం వేకువ ఝామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రలోనే ఉలిక్కిపడి లేచి విలవిలలాడిన చిన్నారి.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. బాధితుడిని కొప్పాలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న కీర్తన్‌గా గుర్తించారు.
శనివారం సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చిన చిన్నారి.. భోజనం చేసి పడుకున్నాడు. అయితే.. నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గం మధ్యలోనే ఆ చిన్నారి కన్నుమూశాడు. కీర్తన్ తండ్రి మంజాచారీ.. కొడుకు చదివే స్కూల్‌లోనే వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పన్నెండేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
(The above story first appeared on LatestLY on Jan 10, 2023 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

