Karnataka Hijab Row: హిజాబ్ తొలగించమన్నందుకు పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు, హిజాబ్‌ లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపించలేమని తేల్చి చెప్పిన తల్లిదండ్రులు

విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల (government School students) వద్ద ఉపాధ్యాయులు ముస‍్లిం విద్యార్థులను అడ్డుకొని హిజాబ్‌ ను తొలగించి వెళ్లాలని కోరారు. దీంతో వారి విన్నపాన్ని విద్యార్థులు నిరాకరించారు.

Karnataka Hijab Row: హిజాబ్ తొలగించమన్నందుకు పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు, హిజాబ్‌ లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపించలేమని తేల్చి చెప్పిన తల్లిదండ్రులు
Karnataka Hijab Row (photo-PTI)

Shivamogga, Feb 14: కర్ణాటకలో హిజాబ్ వివాదం​ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికీ పలు వివాదాలు (Karnataka Hijab Row) చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కర్నాటకలోని శివమొగ్గలో సోమవారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ స్కూల్స్ సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయిన సంగతి విదితమే. కాగా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల (government School students) వద్ద ఉపాధ్యాయులు ముస‍్లిం విద్యార్థులను అడ్డుకొని హిజాబ్‌ ను తొలగించి వెళ్లాలని కోరారు. దీంతో వారి విన్నపాన్ని విద్యార్థులు నిరాకరించారు.

ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) ప్రిపరేటరీ పరీక్షలు జరుగుతుండటంతో వారిని అనుమతించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వారికి హిజాబ్‌ లేకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు రాయాలని సూచించారు. ఈ సూచనను సైతం 13 విద్యార్థులు నిరాకరిస్తూ పరీక్షలను (stage walk-out in Shivamogga over hijab ban) బహిష్కరించారు.

కర్ణాటకలో తెరుచుకున్న పాఠశాలలు, విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై విద్యార్థులు నిరసన, సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్‌ 144 జారీ చేసిన పోలీస్ అధికారులు

ఈ విషయం కాస్తా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకొని పిల్లలను సపోర్ట్ చేశారు. అనంతరం హిజాబ్‌ లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపించలేమని తేల్చి చెప్పి విద్యార్థులను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.

(The above story first appeared on LatestLY on Feb 14, 2022 09:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).