Karnataka: డీకే శివకుమార్ రామనగర జిల్లాలో దారుణం, పోలింగ్ అధికారుల బృందంపై దాడి చేసి బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లిన దుండగులు, వీడియో ఇదిగో..
రామనగర జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ ఎన్నిక కోసం పోలింగ్ బూత్‌కు వెళ్లిన ఎన్నికల అధికారి, అతని బృందంపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. రామనగర జిల్లా హుల్లేనహళ్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల పోలింగ్ బూత్‌కు బుధవారం అధికారి తన బృందంతో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
- Read in
- తెలుగు

ఈ ఘటనలో వారి నుంచి 250 బ్యాలెట్ పేపర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు దోచుకెళ్లినట్లు పోలీసు అధికారి తెలిపారు. నలుగురు నిందితులను గుర్తించామని, ప్రభుత్వ పనులను అడ్డుకున్నందుకు, హత్యాయత్నం చేసినందుకు వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 23 ఏళ్ల తర్వాత హుల్లేనహళ్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి డైరెక్టర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
Here's Video
Poll officials attacked, robbed in Ramanagara, Karnataka.#Karnataka #Ramanagara #Attack pic.twitter.com/59DB3JLM6c
— Ganga News (@GangaNews) September 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 28, 2023 05:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).