Karnataka Shocker: డ్రగ్స్ మత్తులో భార్య తలపై మూత్ర విసర్జన చేసిన భర్త, పోలీసులు ఫిర్యాదు చేసిన బార్య, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపిన కర్ణాటక పోలీసులు

కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చిత్రహింసలు పెట్టడమే కాకుండా..డ్రగ్స్ మత్తులో తన భార్య తలపై మూత్ర విసర్జన (leak on wife’s head) చేశాడనే ఆరోపణలపై డ్రగ్ అడిక్ట్ అయిన భర్తపై (Drug addict husband) కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు ( FIR registered in Bengaluru) చేశారు.

Karnataka Shocker: డ్రగ్స్ మత్తులో భార్య తలపై మూత్ర విసర్జన చేసిన భర్త, పోలీసులు ఫిర్యాదు చేసిన బార్య, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపిన కర్ణాటక పోలీసులు
Representational Image | (Photo Credits: IANS)

Bengaluru, August 10: కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చిత్రహింసలు పెట్టడమే కాకుండా..డ్రగ్స్ మత్తులో తన భార్య తలపై మూత్ర విసర్జన (leak on wife’s head) చేశాడనే ఆరోపణలపై డ్రగ్ అడిక్ట్ అయిన భర్తపై (Drug addict husband) కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు ( FIR registered in Bengaluru) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్‌పై బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ యువతికి– సుదీప్‌కు 2021 లో పెద్దలు పెళ్లి చేశారు.

పెళ్లి సమయంలో రూ.55 లక్షల విలువచేసే మినీ కూపర్‌ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను సుదీప్‌కు ముట్టజెప్పారు. కట్నం, పెళ్లి ఖర్చులు కలిపి రూ.6 కోట్లు అయినట్లు బాధితురాలు తెలిపింది.అయితే అంతటితో సంతృప్తి చెందని భర్త సుదీప్, పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భార్యను వేధించాడు. దీంతో యువతి తండ్రి తమ రెండు కంపెనీలను అల్లుని పేరిట రాశారు. ఆ కంపెనీల్లో వచ్చే లాభం సుదీప్‌ తీసుకునేవాడు.

ప్రియురాలిని వ్యభిచారంలోకి దింపారని 5 మంది మహిళలను కిరాతకంగా చంపిన లవర్, పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు

కాగా సుదీప్‌ డ్రగ్స్‌కు బానిస కాగా స్నేహితులను ఇంటికి పిలిపించుకుని డ్రగ్స్‌ సేవించి మత్తులో భార్య తలపై మూత్రవిసర్జన చేసి వికృతంగా ప్రవర్తించాడు. దీనిని ప్రశ్నిస్తే అసభ్యంగా దూషించేవాడు. ఆమె అత్తమామలకు చెప్పుకోగా వారు కొడుకునే వెనకేసుకొచ్చారు, పైగా నన్నే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Aug 10, 2022 04:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).