Karnataka Shocker: ఒకరిని ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు, అయితే ప్రియురాలిని మరచిపోలేక ఆమె తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు , కర్ణాటకలో దారుణ ఘటన

తనతో పెళ్లికి అంగీకరించలేదన్న కక్షతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. మాజీ ప్రియురాలి తల నరికి హత్య ( Married man beheads ex-girlfriend) చేశాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకుని (Carries severed head to police station) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Karnataka Shocker: ఒకరిని ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు, అయితే ప్రియురాలిని మరచిపోలేక ఆమె తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు , కర్ణాటకలో దారుణ ఘటన
Murder (Photo Credits: Pixabay)

Bengaluru, July 22: తనతో పెళ్లికి అంగీకరించలేదన్న కక్షతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. మాజీ ప్రియురాలి తల నరికి హత్య ( Married man beheads ex-girlfriend) చేశాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకుని (Carries severed head to police station) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన (Karnataka Shocker) కర్ణాటకలోని విజయనగర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుడ్లిగి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల బోజరాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 21 ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థిని నిర్మలను గతంలో అతడు ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

కాగా, బోజరాజు ఇటీవల మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే నిర్మల మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో కత్తిని వెంట ఉంచుకుని కన్నబోరనయ్య హట్టి ప్రాంతంలోని ఆమె ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న నిర్మలపై కత్తితో దాడి చేసి తల నరికి చంపాడు.

ప్రియుడితో రాసలీలలకు భర్త అడ్డు, నిద్రపోతుండగా ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి చంపేసిన భార్య, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన కసాయి

అనంతరం నిందితుడు బోజరాజు మొండెం నుంచి తలను వేరు చేసి సంచిలో వేసుకుని తీసుకెళ్లి కన్నబోరనయ్య పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై హత్య, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

(The above story first appeared on LatestLY on Jul 22, 2022 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).