Screenshots From Kharagpur Teacher Viral Video (Photo Credits: X/@AmbedkariteLM)

Kharagpur Viral Video: పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో తరగతి గదిలోనే విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపుతోంది. పాఠాలు చెబుతున్న సమయంలో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినిని పదేపదే అనుచితంగా తాకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అతడిపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు, కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఖరగ్‌పూర్‌లోని మహాశక్తి కేంద్రం సమీపంలో ఉన్న ఇండా బజార్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అయిన సుమారు రెండు నిమిషాల నిడివి గల ఆ క్లిప్‌లో.. బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్‌బోర్డ్ ఉన్న బల్ల వద్ద ఉపాధ్యాయుడు విద్యార్థినికి అత్యంత సమీపంలో కూర్చుని ఉన్నాడు. బోధన నెపంతో అతను.. విద్యార్థిని చేయి, భుజం, వీపుపై పలుమార్లు హద్దుమీరి చేతులు వేయడం స్పష్టంగా కనిపించింది. ఆ విద్యార్థిని భయంతో కదలకుండా ఉన్నప్పటికీ.. ఆమె ముఖంలో తీవ్ర అసౌకర్యం కనిపిస్తోంది. గదిలోని దూరపు మూల నుంచి రికార్డు చేసిన ఈ వీడియో 'ఎక్స్' (ట్విట్టర్), 'ఫేస్‌బుక్' ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ప్రచారమైంది.

వీడియో ఇదిగో, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని లెక్చ‌ర‌ర్‌ని చిత‌క‌బాదిన త‌ల్లిదండ్రులు, ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో ఘటన

ఈ వీడియో వెలుగులోకి రావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వృత్తిపరమైన పరిమితులను దాటి ఇలా ప్రవర్తించడం క్షమించరాని నేరమని అభివర్ణిస్తున్నారు. విద్యాసంస్థల్లో ముఖ్యంగా విద్యార్థినులకు పూర్తి సురక్షితమైన, భయరహిత వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

స్థానిక 'ఖరగ్‌పూర్ దర్శన్' వంటి ఫేస్‌బుక్ పేజీలు ఈ ఘటనను ఖండిస్తూ.. బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేయాలని కోరాయి. అంతేకాకుండా ఆమెకు పూర్తి న్యాయపరమైన మద్దతు అందిస్తామని స్పష్టం చేశాయి. సదరు ఉపాధ్యాయుడిపై గతంలోనూ ఇలాంటి అనుచిత ప్రవర్తన ఆరోపణలు వచ్చినప్పటికీ.. తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే అతడు మళ్లీ ఇలా హద్దుమీరాడని పోస్టుల్లో ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈసారి మాత్రం బాధ్యుడిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

DISCLAIMER: This article is strictly for informational and educational purposes to raise awareness about the said topic. LatestLY DO NOT host, distribute, or provide links to sexually explicit content, leaked videos, or pirated material. Any search terms or keywords mentioned are solely for the purpose of explaining the viral trend and its associated dangers. We strongly condemn the circulation of non-consensual intimate imagery (NCII) and advise all readers to refrain from searching for or sharing such content, as doing so may lead to severe legal consequences.