Kolkata Shocker: భార్య స్నేహితురాలిపై భర్త కన్ను, విషయం తెలిసి భర్త తలను నరికి నదిలో పడేసిన భార్య, ఆమె ఫ్రెండ్, ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో దారుణ ఘటన

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. త‌న స్నేహితురాలిని వ‌ల‌లో వేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన భ‌ర్త త‌ల‌ను ఓ భార్య (Woman chops off husband's head) న‌రికేసింది. ఈ దారుణ ఘటన ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో వెలుగుచూసింది.

Kolkata Shocker: భార్య స్నేహితురాలిపై భర్త కన్ను, విషయం తెలిసి భర్త తలను నరికి నదిలో పడేసిన భార్య, ఆమె ఫ్రెండ్, ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో దారుణ ఘటన
Image used for representational purpose (Photo Credits: Pixabay)

Kolkata, May 25: వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. త‌న స్నేహితురాలిని వ‌ల‌లో వేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన భ‌ర్త త‌ల‌ను ఓ భార్య (Woman chops off husband's head) న‌రికేసింది. ఈ దారుణ ఘటన ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బాధితుడు శుభ్‌జ్యోతిబ‌సుకు నెల రోజుల కింద‌ట పూజ‌తో వివాహం జ‌రిగింది. బ‌సు ఇటీవ‌ల త‌న భార్య స్నేహితురాలు శ‌ర్మిష్ట‌ను క‌లిసిన మీద‌ట ఆమెకు దగ్గ‌ర‌య్యేందుకు (Trying to woo her friend) ప్ర‌య‌త్నించాడు.

ఈ విష‌యం బ‌సు భార్య పూజ‌కు తెలియ‌డంతో అత‌డిని క‌డ‌తేర్చాల‌ని ఫ్రెండ్స్‌తో క‌లిసి ప‌ధ‌కం ర‌చించింది. బ‌సు చేష్ట‌ల‌తో ఆగ్ర‌హానికి లోనైన శ‌ర్మిష్ట త‌న భ‌ర్త‌ సుబిర్తో పాటు పూజ‌కు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేసేది. వీరంతా క‌లిసి బ‌సుకు గుణ‌పాఠం నేర్పాల‌ని నిర్ణ‌యించారు. బ‌సును హుగ్లీ న‌ది వ‌ద్ద‌కు పిలిపించిన నిందితులు అత‌డికి డ్రింక్స్ ఆఫ‌ర్ చేశారు.

వీడియో వైరల్.. భర్తను క్రికెట్ బ్యాట్‌తో చావబాదిన భార్య, సీసీ టీవీకెమెరాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన రికార్డు, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

మ‌ద్యం సేవించిన త‌ర్వాత సుబిర్ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో క‌లిసి ప‌దునైన ఆయుధంతో బ‌సు త‌ల‌ను న‌రికి న‌దిలో పడేశారు. మిగిలిన మృత‌దేహాన్ని వ్యాన్‌లో తీసుకువ‌చ్చి కాల‌వ‌లో ప‌డేశారు. మృత‌దేహం ల‌భ్యం కావ‌డంతో టాటూస్ ఆధారంగా బాధితుడిని కుటుంబ స‌భ్యులు గుర్తించారు. ఈ కేసులో నిందితులంద‌రినీ అరెస్ట్ చేసిన పోలీసులు కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

(The above story first appeared on LatestLY on May 25, 2022 04:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).