MP Shocker: మహిళా పోలీస్ అధికారి స్నానం చేస్తుండగా వీడియో, రూ.5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
వేధింపులు సామాన్యులకే కాదు పోలీసు అధికారిణిలకు కూడా తప్పడం లేదు. మధ్యప్రదేశ్‌లో కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచార దాడి మరువకముందే మరో పోలీస్ అధికారిణిని వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Bhopal, Sep 28: వేధింపులు సామాన్యులకే కాదు పోలీసు అధికారిణిలకు కూడా తప్పడం లేదు. మధ్యప్రదేశ్‌లో కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచార దాడి మరువకముందే మరో పోలీస్ అధికారిణిని వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె డ్రైవర్ (Bhopal police woman’s driver) ఏకంగా ఆమె ఇంట్లోనే బాత్రూమ్‌లో కెమెరా పెట్టి ఆ వీడియోలతో ( booked for filming her during shower) బ్లాక్ మెయిల్ చేశాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు డిలీట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం అతడిని గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పోలీస్ అధికారిణికి డ్రైవర్‌గా ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22వ తేదీన కానిస్టేబుల్ ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. బాత్రూమ్ తలుపుపై వీడియో రికార్డింగ్ ఆన్ చేసి సెల్‌ఫోన్ ఉంచాడు. స్నానం కోసం వెళ్లిన ఆమె ఆ సెల్‌ఫోన్ గుర్తించి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ పరారయ్యాడు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన ఇంటికొచ్చిన ఆ ఆకతాయి డ్రైవర్ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీంతో ఆమె పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. కాగా శనివారం నిందితుడు హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ చేరుకున్నాడు. తనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రామ్జీ శ్రీవాస్తవ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 28, 2021 04:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

